పాటలు లేకుండా ప్రయోగం చేస్తోన్న విజయ్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి ఆశించిన విజయం లభించడం లేదు. సినిమా, సినిమాకీ కొత్త జోనర్ ను వెతుకుతూ వెళుతోన్నా.. అనుకున్న విజయాన్నైతే అందుకోలేకపోతున్నాడు. ఈసారి ఓ పెద్ద ప్రయోగానికే శ్రీకారం చుట్టబోతున్నాడట విజయ్ దేవరకొండ. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేయబోతున్న మూవీలో విజయ్ ఎంతో వైవిధ్యంగా కనిపించనున్నాడట. తన పాత్ర మాత్రమే కాదు.. ఈ మూవీ ఆద్యంతం ఓ కొత్త ప్రయోగంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అనిరుధ్ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ను పెట్టుకున్నా.. కథ రీత్యా ఈ సినిమాలో పాటలుండవని తెలుస్తుంది. అయితే.. అనిరుధ్ అందించే బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ఈ మూవీని ఓ స్థాయిలో నిలబెడుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మేకర్స్. రేపటి నుంచి విశాఖపట్నంలో ఈ మూవీ లాంగ్ షెడ్యూల్ మొదలుపెట్టుకోనుంది.

Related Posts