శ్రీలీల స్పెషల్ సాంగ్ కి ఓ.కె. చెప్పిందా?

ప్రెజెంట్ జెనరేషన్ హీరోయిన్స్ లో డ్యాన్సుల్లో దుమ్మురేపే భామలు ఎవరంటే? టక్కున చెప్పే పేర్లు సాయిపల్లవి, శ్రీలీల. వీరిలో సాయిపల్లవి రూటే సెపరేటు. కాస్టింగ్ తో తనకు ఏమాత్రం సంబంధం లేదు.. సినిమాలో కంటెంట్ ముఖ్యమంటోంది. స్టార్ పవర్ ఉన్నా లేకపోయినా.. కథ బాగుంటే చాలు సినిమాకి ఓ.కె. చెబుతోంది. మరోవైపు శ్రీలీల.. నేటితరం స్టార్ హీరోలతో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే తెలుగులో అగ్ర కథానాయకులను ఓ చుట్టు చుట్టేసిన శ్రీలీల.. ఇప్పుడు వరుసగా తమిళ సినిమాలతో బిజీ అవుతోంది.

ఇప్పటికే తమిళంలో అగ్ర కథానాయకుడు అజిత్ తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో నటించే ఛాన్స్ అందుకుందట శ్రీలీల. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. లేటెస్ట్ గా మరో కోలీవుడ్ స్టార్ విజయ్ తోనూ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. విజయ్ అప్ కమింగ్ మూవీ ‘గోట్’లో ఓ స్పెషల్ సాంగ్ లో మురిపించడానికి ముస్తాబవుతోందట శ్రీలీల. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. విజయ్ ‘గోట్’ మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts