వరలక్ష్మి శరత్ కుమార్ ఛాలెంజింగ్ పాత్రలో ‘శబరి’

వరలక్ష్మి శరత్ కుమార్ అంటే ఓ తమిళ అమ్మాయి అనుకోరు ఎవరూ.. అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయి అనుకుంటారు. ఎందుకంటే తమిళం కంటే ఎక్కువగా తెలుగులో సినిమాలు చేస్తుంది. పైగా.. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఇక.. లేటెస్ట్ గా ‘శబరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది వరలక్ష్మి శరత్ కుమార్.

అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన ‘శబరి’ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న సినిమా విడుదలవుతోంది. ‘శబరి’ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. భర్తతో సమస్యల కారణంగా.. అతని నుంచి వేరుగా ఉంటూ తన కుమార్తెను ఒంటరిగా పెంచుకునే ఛాలెంజింగ్ రోల్ లో వరలక్ష్మి కనిపించబోతుందట. ఈ మూవీలో తన సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో ఫిదా చేస్తానంటోంది వరలక్ష్మి. ‘శబరి’ తర్వాత వరలక్ష్మి నటించిన మరో చిత్రం ‘కూర్మ నాయకి’ విడుదలకు సిద్ధమైంది. ఇంకా.. ధనుష్‌‌‌‌ ‘రాయన్’తో పాటు.. కన్నడలో సుదీప్ హీరోగా నటిస్తున్న ‘మ్యాక్స్’లోనూ నటిస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్.

Related Posts