‘దొంగ పోలీస్’గా రాబోతున్న రవితేజ

మాస్ మహారాజ రవితేజ నటించిన ‘విక్రమార్కుడు’ సినిమా ఘన విజయాన్ని సాధించింది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా ఆ తర్వాత పలు భాషల్లో రీమేకై.. అక్కడా మంచి విజయాలు సాధించింది. ఇటీవల ‘విక్రమార్కుడు’ సినిమాకి సీక్వెల్ స్టోరీ రాసినట్టు రైటర్ విజయేంద్రప్రసాద్ ప్రకటించారు. అయితే.. ‘విక్రమార్కుడు’ సీక్వెల్ సంగతేమో కానీ.. ఇప్పుడు రవితేజ మళ్లీ ‘విక్రమార్కుడు’ తరహా సినిమా చేస్తున్నాడట.

‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ తో రవితేజ ఒక సినిమాకి కమిట్ అయ్యి ఉన్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి ‘దొంగ పోలీస్’ అనే టైటిల్ అనుకుంటున్నాడట అనుదీప్. అంటే.. ‘విక్రమార్కుడు’ సినిమా తరహాలోనే ఈ సినిమాలో రవితేజ.. దొంగ గా, పోలీస్ గా కనిపిస్తాడనే ప్రచారం ఉంది. ఆద్యంతం అనుదీప్ మార్క్ కామెడీతో.. రవితేజ స్టైల్ మాస్ తో ‘దొంగ పోలీస్’ ఉండబోతుందట. గతంలో ‘దొంగ పోలీస్’ టైటిల్ తో మోహన్ బాబు ఒక సినిమా చేసుండడం విశేషం.

Related Posts