Sreeleela : నో గ్లామర్ బోర్డ్ పెట్టేసిన శ్రీ లీల

టాలీవుడ్ మోస్ట్ వాంటెండ్ బ్యూటీగా మారింది శ్రీ లీల. ఫస్ట్ మూవీ పెళ్లి సందడితోనే తెలుగువారిని కట్టిపడేసిన ఈ కన్నడ సుందరి తర్వాత ధమాకాతో దుమ్మురేపింది. అందంతో పాటు టాలెంట్.. దాంతో పాటు డబ్బింగూ చెప్పుకునే ప్రతిభ కూడా ఉన్న శ్రీ లీల ఇప్పుడు ఇండియాలోనే ఏ హీరోయిన్ లేనంత బిజీగా ఉందంటే అతిశయోక్తి కాదు.

తన చేతిలో ఇప్పుడు ఏకంగా తొమ్మిది ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇన్ని సినిమాలు ఏ హీరోయిన్ కూ లేవు. అందుకే అమ్మడు అడిగిందే డిమాండ్ అన్నట్టుగా మారింది. అఫ్ కోర్స్ ను కూడా ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నందుకు చాలా హార్డ్ వర్క్ చేస్తోంది. మూడు షిఫ్ట్స్ పనిచేస్తూ అందరు నిర్మాతలనూ ఆనందంగా ఉంచే ప్రయత్నం చేస్తోంది. అందుకే ఆమె ఏం అడిగినా నో చెప్పే సాహసం చేయడం లేదు నిర్మాతలు. అందుకే మొదటి రెండు సినిమాల్లో ఛలాకీగా కనిపించిన ఈ సోయగం.. ఇప్పుడు గ్లామర్ విషయంలో కండీషన్స్ అప్లై అంటోందట. అంతే కాదు.. అసలు నో ఎక్స్ పోజింగ్ అనే బోర్డ్ కూడా పెట్టేసిందని చెబుతున్నారు.


నిజానికి గ్లామర్ తో కెరీర్ మొదలుపెట్టి.. తర్వాత నో గ్లామర్ అన్న బోర్డ్ పెట్టిన హీరోయిన్లందరి కెరీర్ మళ్లీ గ్లామర్ రోల్స్ తోనే ముగిసిపోయింది అనేది వెండితెర చరిత్ర చెబుతున్న సత్యం. ఈ శ్రీ లీల ఏం ఖర్మ.. ఒకప్పుడు అభివన సావిత్రి అనిపించుకున్న సౌందర్యే కెరీర్ చివర్లో మళ్లీ గ్లామర్ రోల్స్ చేయక తప్పలేదు.

ఇంక ఆల్రెడీ ఆ తరహా చిత్రాలతోనే ప్రారంభించిన ఈవిడ ఓ మేటరా అని కొంతమంది గిట్టని వాళ్లు కూడా చెప్పుకుంటున్నారు. ఏదేమైనా శ్రీ లీల ఈవిడికు సింగిల్ హ్యాండెడ్ గా సినిమాలను నిలబెట్టేంత సీన్ లేదు. కాకపోతే కాస్త కంటెంట్ ఉన్న సినిమాల్లో కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఆ కలర్స్ కు కూడా బారికేడ్స్ పెడితే ఇంక రాబోయే రోజుల్లో శ్రీ లీల అంటే నో చెబుతారేమో దర్శక నిర్మాతలు.

Related Posts