ట్రూలవర్‌ని మిస్‌ చేసుకోలేకపోయాను : ప్రొడ్యూసర్ SKN

రీసెంట్ గా బేబీ, అంతకు ముందు ట్యాక్సీవాలా తో బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించిన ప్రొడ్యూసర్‌ SKN. స్టార్‌ డైరెక్టర్‌ మారుతితో కలిసి తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్న సినిమా ‘ట్రూలవర్‌’ . తమిళ్ యాక్టర్ మణికందన్‌, శ్రీ గౌరీప్రియ జంటగా యూత్‌ మెచ్చే లవ్‌స్టోరీతో ఈ సినిమా రాబోతుంది. మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్రవరి 10 న ట్రూలవర్‌ గ్రాండ్ రిలీజ్ సందర్భంగా.. ప్రొడ్యూసర్‌ ఎస్ కే ఎన్‌ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.


ఈ సినిమా బడ్జెట్ పరంగా చిన్న సినిమానే కావొచ్చు. కానీ గౌరవప్రదంగా, అందరికీ అమోదయోగ్యమైన డేట్‌లో ట్రూలవర్‌ను రిలీజ్ చేస్తున్నాం. ఈ మూవీని బేబీ తో పోల్చలేం. రెండు విభిన్నమైన కథలు. ఓ ఫ్రెండ్‌ ద్వారా ఈ ఆఫర్‌ వచ్చింది. మారుతి గారు నన్ను కూడా పిలిచి చూద్దాం రమ్మంటే వెళ్లి చూసాను. బాగా నచ్చింది దాంతో సినిమా చేయడానికి నిర్ణయించుకున్నామన్నారు.


సాధారణంగా స్ట్రెయిట్ మూవీస్ చేయడమంటేనే ఇష్టం. కానీ ఇలాంటి మంచి పాయింట్‌తో వచ్చిన సినిమాలను మిస్‌ చేసుకోకూడదనుకున్నాను. ఇప్పుడు ఏ భాషా చిత్రమైనా ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. రెండు భాషల్లోనూ ఒకేసారి రిలీజ్‌ చేస్తున్నాం. ఎందుకంటే.. ఓ భాషా సినిమాను తెలుగులో వేర్వేరు గా రిలీజ్‌ చేస్తే ఇక్కడ రిలీజ్‌ టైమ్‌ కి ఒరిజినల్ వెర్షన్‌ ఓటీటీలోకి వచ్చేస్తుంది. అందుకే ఒకేసారి రెండు భాషల్లో రిలీజ్ చేస్తున్నామన్నారు.


ఏ రిలేషన్ అయినా నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా మెయిన్ పాయింట్ అదే. అందుకే బాగా నచ్చింది నమ్మకం కుదిరిందన్నారు ఎస్‌కేఎన్.


కొత్త వాళ్లతో మూవీ చేసినప్పుడు కంటెంట్ యూత్ ఫుల్ గా ఉంటే ఆ సినిమాల రీచ్ బాగుంటుంది. నెక్ట్ నేను చేస్తున్న నాలుగు సినిమాల్లో మూడు యూత్ ఫుల్ మూవీస్ ఉంటాయి. ఒకటి సైన్స్ ఫిక్షన్ తో ఔటాఫ్ ది బాక్స్ గా ఉంటుంది.నాకు సహజంగా లవ్ స్టోరీస్, యూత్ ఫుల్ మూవీస్ ఇష్టం. నేను మారుతి గారితో కలిసి చేసిన ఈ రోజుల్లో కూడా యూత్ ఫుల్ మూవీ. పెద్ద స్టార్స్ తో సినిమాలు చేస్తే దాని బడ్జెట్ ఎక్కువ కాబట్టి మేకింగ్ కు మేము ప్రిపేర్ కావాలి. సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా మంచి సక్సెస్ అయ్యింది. మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. మార్చి వరకు మంచి రన్ ఉంటుందని ఆశిస్తున్నామన్నారు.


సందీప్‌రెడ్డి వంగాలో ఉన్న అగ్రెసివ్‌ నేచర్‌ సాయిరాజేష్‌లో కూడా ఉంది. అందుకే బేబీ సినిమాను హిందీలో కూడా రీమేక్‌ చేస్తున్నాం. అర్జున్‌ రెడ్డి ఇక్కడ కంటే హిందీలో ఎక్కువ కలెక్ట్ చేసింది. బేబీ కూడా అలాంటి హ్యూజ్‌ సక్సెస్‌ కాబోతుందని ఆశిస్తున్నామన్నారు. – ప్రొడ్యూసర్ గా అప్పర్ ప్రైమరీ స్థాయిలో ఉన్నాను. కాలేజ్ స్థాయికి వచ్చాక అల్లు అర్జున్ తో సినిమా నిర్మిస్తానన్నారు ఎస్‌కేఎన్‌.

Related Posts