సుకుమార్ వారసురాలు వచ్చేసింది

వారసత్వం అనేది చిత్ర పరిశ్రమలో చాలా కామన్. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న దాదాపు స్టార్ హీరోలందరూ వారసత్వంగా వచ్చినవారే. చిత్ర పరిశ్రమపై తమకున్న ప్యాషన్ తో తమ వారసులను సైతం ఇదే రంగంలోకి తీసుకొచ్చేలా ప్రోత్సహించే వారిలో సుకుమార్ కూడా చేరారు. తెలుగులో అగ్ర దర్శకుడిగా సత్తా చాటుతున్న సుకుమార్.. ఇప్పుడు తన కుమార్తె సుకృతి వేణి ని నటన రంగంలో ప్రోత్సహిస్తున్నారు.

సుకుమార్‌ – తబిత దంపతుల కుమార్తె సుకృతి వేణి. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న సుకృతి తాజాగా దాదాసాహెబ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో బెస్ట్ డెబ్యూ చైల్డ్ యాక్టర్ గా అవార్డు అందుకుంది. ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంలోని నటనకు గానూ ఈ అవార్డు సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంయుక్తంగా ‘గాంధీ తాత చెట్టు’ బాలల సినిమాని నిర్మించాయి. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ ప్రధానాంశంగా పద్మావతి మల్లాది ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై మెరిసిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

Related Posts