రవితేజతో నటించడం నా అదృష్టం : హీరోయిన్ కావ్య థాపర్

మాస్‌ మహారాజ్ రవితేజ, అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్ లీడ్‌ రోల్స్‌తో రాబోతున్న మోస్ట్ స్టైలిష్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ఈగల్‌. కార్తీక్‌ ఘట్టమనేని డైరెక్షన్‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజి విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 9 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కావ్యాథాపర్‌ మీడియాతో సినిమా విశేషాలు ముచ్చటించింది.


ఈగల్ లో యాక్షన్ రోమాన్స్ చాలా యూనిక్ గా వుంటాయి. రోమాన్స్ అయితే చాలా డిఫరెంట్ గా, కొత్తగా వుంటుంది. ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం ముంబైలో వున్న సమయంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని గారు ఈగల్ కథ చెప్పారు. చాలా కొత్తగా, అద్భుతంగా అనిపించిందన్నారు.


ఈ చిత్రంలో రచన అనే పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు కావ్యా థాపర్. రవితేజ గారు, నా పాత్రల మధ్య కెమిస్ట్రీ చాలా యూనిక్ గా వుంటుంది. చాలా యునిక్ గోల్స్ వున్న అమ్మాయిగా కనిపిస్తానన్నారు.


రవితేజ గారి వ్యక్తిత్వానికి నేను పెద్ద అభిమానిని. ఆయన చాలా పాజిటివ్ ఎనర్జీతో వుంటారు.రవితేజ గారితో సినిమా చేయడం నా అదృష్టమన్నారు.


తెరపై కావ్య కాకుండా రచన కనిపించిందని రచయిత మణి గారు ఇచ్చిన కాంప్లిమెంట్‌ బెస్ట్‌ కాంప్లిమెంట్‌గా ఫీలయ్యానన్నారు కావ్యథాపర్.


పోలాండ్, లండన్ ఇలా అద్భుతమైన ఫారిన్ లోకేషన్స్ లో ఇంటర్ నేషనల్ లెవల్ లో షూట్ చేశారు. నిజంగా ఒక వెకేషన్ లానే అనిపించింది. చాలా ఎంజాయ్ చేశానన్నారు.


సినిమాని ఇంటర్నేషనల్ గా చాలా గ్రాండ్ గా చిత్రీకరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో వవర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ బ్యానర్‌లో మరిన్ని చిత్రాలు చేసే అవకాశం రావాలని కోరారు.
భవిష్యత్తులో ఫుల్ మాస్ యాక్షన్ సినిమా లతో పాటు సూపర్ నేచురల్ సినిమాలు చేయాలని వుందన్నారు హీరోయిన్ కావ్యాథాపర్.

Related Posts