‘కృష్ణమ్మ’ ట్రైలర్.. సత్యదేవ్ రివెంజ్ డ్రామా

కంటెంట్ బలంగా ఉన్న సినిమాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వస్తోన్న సత్యదేవ్.. తాజాగా ‘కృష్ణమ్మ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించిన ఈ సినిమాకి వివి గోపాల కృష్ణ దర్శకుడు. ఈ సినిమాలో సత్యదేవ్ కి జోడీగా అథిరా రాజ్ నటించింది. మే 10న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోన్న ‘కృష్ణమ్మ’ ట్రైలర్ రిలీజయ్యింది.

అన్యాయంగా ఓ కేసులో ఇరుక్కున్న ముగ్గురు యువకుల కథతో ఈ సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. అస‌లు ఆ కేసు ఏంటి ? ఆ కేసు నుంచి వారు బయట పడ్డారా? లేదా? అనే ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా.. ట్రైలర్ చివరిలో ‘ఇన్నాళ్లు ఎప్పుడు పుట్టాము, ఎవ‌రికి పుట్టామో తెలియ‌క పోవ‌డ‌మే బాధ అని అనుకున్నాను.. కానీ..ఎందుకు చ‌నిపోతున్నామో, ఎవ‌డి చేతుల్లో చ‌నిపోతున్నామో తెలియకపోవడమే అస‌లైన భాద’ అంటూ స‌త్య‌దేవ్ చెప్పిన డైలాగ్ ఇంప్రెస్సివ్ గా ఉంది.

Related Posts