సుహాస్ ‘గొర్రె పురాణం’ కథేంటి?

సినిమా సినిమాకి కథల ఎంపికలో విలక్షణతను చూపిస్తున్న సుహాస్.. లేటెస్ట్ గా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’తో బంపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ‘గొర్రె పురాణం’ అంటూ మరో వైవిధ్యభరిత చిత్రంతో రాబోతున్నాడు. కొత్త డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఫోకల్ వెంచర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి ‘లవ్ స్టోరీ’ ఫేమ్ పవన్ సి.హెచ్. సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు.

చంచల్ గూడ జైలులో ఉన్న ఏ1 ఏసుకు కోర్టు బెయిల్ నిరాకరించింది అంటూ బ్రేకింగ్ న్యూస్ చెప్తున్న యాంకర్ వాయిస్ తో ఈ గ్లింప్స్ మొదలైంది. ఆ తర్వాత జనాలు, మీడియా, పోలీసులు.. ఇలా వీరందరిని చూపిస్తూ ‘గొర్రె పురాణం’ టైటిల్ ను చూపించారు. చివర్లో జైలు నుంచి ఒక గొర్రె బయటకు రావడం ఈ గ్లింప్స్ లో ఉంది. అసలు గొర్రె జైలుకి వెళ్లడం ఏంటి? అనే ఆసక్తికర అంశంతో రాబోతున్న ‘గొర్రె పురాణం’ కథేంటో తెలియాలంటే ఈ సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే.

Related Posts