అనిల్ రావిపూడికి కౌంటర్ ఇచ్చిన రాజమౌళి

ప్రస్తుతం తెలుగులో అపజయమెరుగని దర్శకుల లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది రాజమౌళి అయితే.. మరొకరు అనిల్ రావిపూడి. తొలి సినిమా మొదలుకొని.. ఇప్పటివరకూ అపజయమే ఎరుగని ఈ డైరెక్టర్స్ మధ్య లేటెస్ట్ గా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. సత్యదేవ్ హీరోగా కొరటాల శివ సమర్పణలో రూపొందిన ‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు నిర్మాత హోదాలో కొరటాల శివతో పాటు.. స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ ఈవెంట్లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. కొరటాల శివ గారు ‘దేవర’ గురించి.. రాజమౌళి గారు.. మహేష్ బాబు మూవీ గురించి అప్డేట్స్ ఇవ్వాలని అడిగాడు. మహేష్ బాబు మూవీ ఓపెనింగ్ ఎప్పుడు ఉంటుంది చెప్పాలంటూ రాజమౌళిని అడిగాడు.

కొరటాల శివ ‘దేవర’ రిలీజ్ డేట్ గురించి మరోసారి చెప్పగా.. జక్కన్న మాత్రం మహేష్ మూవీ అప్డేట్స్ ను చెప్పకుండా.. అనిల్ రావిపూడికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. అనిల్ రావిపూడి వెనకాలే కెమెరా పట్టుకొని నడుస్తూ, ఎవరైనా మూసుగేసి గుద్దేస్తే 10 వేలు ఇస్తా అంటూ తనదైన శైలిలో పంచ్ వేశాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Posts