టికెట్ కాదు ఏకంగా థియేట‌ర్ నే బుక్ చేసుకోండి

క‌రోనా రావ‌డంతో.. సినిమాని చూసే విధానంలో చాలా మార్పులు వ‌చ్చాయి. ముఖ్యంగా థియేట‌ర్లు మూత‌ప‌డ‌డంతో ఓటీటీకి డిమాండ్ బాగా పెరిగింది. అయితే.. ఎంత ఓటీటీలో సినిమా చూసినా.. థియేట‌ర్లు చూసిన ఎక్స్ పీరియ‌న్స్ వేరు. క‌రోనా రెండు వేవ్ లు అయ్యాయి. ఇప్పుడు అంతా సెట్ అయ్యింది అనుకుంటుంటే.. క‌రోనా థ‌ర్డ్ వేవ్ వ‌చ్చింది. పాన్ ఇండియా మూవీస్ వాయిదా ప‌డ్డాయి. ముఖ్యంగా ప్రజలు.. ప‌బ్లిక్ గేథ‌రింగ్స్ ఉన్నప్రాంతాల‌కు వెళ్లాలంటేనే ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకోవాల్సిన ప‌రిస్థితులు ఏర్పడ్డాయి.

దీంతో కుటుంబం అంతా క‌లిసి బ‌య‌ట‌కి వెళ్లే ప‌రిస్థితులు లేవు. థీయేట‌ర్స్, మాల్స్ ఓపెన్ చేసిన‌ప్ప‌టికి ఎక్కువ ర‌ద్దీ ఉండే ప్రాంతాలు కావ‌డంతో అక్క‌కి వెళ్ల‌డానికి వెన‌క‌డుగు వేస్తోన్నారు చాలా మంది. అయితే.. క్లోజ్డ్ గ్రూప్‌తో మాత్రమే పెద్ద స్క్రీన్ లో సినిమా చూడాల‌నుకునే వారే లక్ష్యంగా స్టార్ ట్రాక్ గ్రూప్ కుటుంబాల కోసం హైదరాబాద్‌లో ప్రైవేట్‌గా నిర్వహించబడుతున్న లగ్జరీ హోమ్ థియేటర్‌ను ప్రారంభించింది. సికింద్రాబాద్‌లో ఈ థియేట‌ర్ ను ప్రారంభించింది ఈ సంస్థ‌. ఈ థియేట‌ర్ లో మీరు సినిమా చూడాలనుకంటే రెండు లేదా మూడు రోజుల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ సంస్థ అందుబాటులో ఉంచిన వెబ్‌సైట్ ద్వారా ఎవ‌రైన ఈ థియేట‌ర్ ను బుక్ చేసుకోవ‌చ్చు అంటున్నారు సంస్థ ప్ర‌తినిధులు.
నార్మ‌ల్ రోజుల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య రూ. 1,500 వీకెండ్స్ లో వారాంతాల్లో రూ. 1,700 చెల్లించి ఈ ప్రైవేట్ హోమ్ థియేటర్‌ను అద్దెకు తీసుకోవచ్చు. ఈ ఐడియా బాగానే ఉంది. ఈ మినీ-థియేటర్‌లో హై-ఎండ్ ప్రొజెక్షన్, సౌండ్ సిస్టమ్ సౌక‌ర్యాలు ఉన్నాయి. 15 సౌండ్ స్పీకర్లు తో 143 అంగుళాల స్క్రీన్‌ని ను ఏర్పాటు చేశారు నిర్వాహ‌కులు. ఈ మినీ థియేటర్ ను ఈ వెబ్ సైట్ https://sites.google.com/view/startrackgroup/testimonials ద్వారా బుక్ చేసుకోవచ్చు. మ‌రి.. రానున్న రోజుల్లో ఈ ప్రైవేట్ హోమ్ థియేట‌ర్ల‌కు డిమాండ్ పెరుగుతుందేమో చూడాలి.

Related Posts