సీరియస్ బాట పడుతోన్న అల్లరి నరేష్

తెలుగులో షార్ట్ పీరియడ్ లోనే 50 సినిమాల మైలురాయిని దాటిన హీరో అల్లరి నరేష్. తొలుత వరుసగా కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్.. ఆ తర్వాత అన్ని తరహా పాత్రలతోనూ తన విలక్షణతను చాటుకున్నాడు. ప్రస్తుతం మళ్లీ వరుసగా కామెడీ సినిమాలతో అలరించడానికి రెడీ అవుతున్నాడు. అల్లరి నరేష్ నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఆ… ఒక్కటీ అడక్కు’ మే 3న విడుదలకు ముస్తాబవుతోంది.

ఈ సినిమా తర్వాత ‘బచ్చల మల్లి’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ తుని ప్రాంతానికి చెందిన బచ్చల మల్లి అనే దొంగ కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో తాను మూర్ఖత్వానికి పేరుగాంచిన ఓ డిఫరెంట్ ఛాలెంజింగ్ రోల్ లో కనిపించబోతున్నానని హింటిచ్చాడు నరేష్.

‘బచ్చలమల్లి’ తర్వాత మళ్లీ వరుసగా రెండు కామెడీ ఎంటర్‌టైనర్స్ చేయనున్నాడట అల్లరి నరేష్.

Related Posts