ఆచార్య పాట వివాదం. కేసు పెడ‌తామంటూ హెచ్చ‌రిక‌

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య‌. ఈ చిత్రానికి బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తే.. చ‌ర‌ణ్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టించింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఆచార్య క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఫిబ్ర‌వ‌రి 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది.

ఇదిలా ఉంటే.. రీసెంట్ గా ఆచార్య సినిమా నుంచి భాస్క‌ర‌భ‌ట్ల రాసిన సానా క‌ష్టం.. అనే పాట‌ను విడుద‌ల చేశారు. ఈ పాట‌ను ఇలా రిలీజ్ చేసారో లేదో.. అలా ఆడియెన్స్ ని ఆక‌ట్టుకుంది. యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతుంది. అయితే.. ఈ పాట ఇప్పుడు వివాద‌స్ప‌దం అవుతుంది. కార‌ణం ఏంటంటే.. ఈ పాట‌లో ఆర్.ఎం.పి, పి.ఎం.పి. వైద్య వృత్తిని కించపరిచే విదంగా “ఏడేడో నిమరొచ్చని కుర్రాల్లే ఆర్ఎంపి లు అవుతున్నారే.. అని ఉంది.

తక్షణమే ఆ పాటను మార్చకుంటే ఆచార్య సినిమా నిర్మాత పై కేసుపెడతామని.. తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పసునూరి. సత్యనారాయణ డిమాండ్ చేశారు. జనగామ జిల్లా పోలీస్ అధికారులును కలిసి మెమోరండం అందజేశారు. అలాగే కోర్టు అడ్వకేట్ ను కలిసి న్యాయ సలహాలు కొరకు వారిని సంప్రదించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు జిల్లా కోశాధికారి మంతెన రమేష్ .జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి మార్ కొండయ్య, జనగామ టౌన్ అధ్యక్షుడు చిదురాల రాజు, కార్యదర్శి విశ్వనాథము. ఐలయ్య, చారి, ప్రభాకర్.ఏ లిషా తదితరులు పాల్గొన్నారు. మ‌రి.. ఆచార్య మేక‌ర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related Posts