మహేష్ కోసం అనిల్ రావిపూడి యాడ్.. వీడియో వైరల్

సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈమధ్య సూపర్ స్టైలిష్ గా మారిపోయాడు. లాంగ్ హెయిర్ తో.. క్లీన్ షేవ్ లుక్ లో నవ యువకుడిగా అదరగొడుతున్నాడు. అదంతా రాజమౌళి సినిమాకోసమే. అయితే.. మధ్యలో కొన్ని యాడ్స్ లోనూ సందడి చేస్తున్నాడు. లేటెస్ట్ గా అభిబస్ కోసం మహేష్ చేసిన అడ్వర్‌టైజ్ మెంట్ సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. ఈ యాడ్ ని డైరెక్ట్ చేసింది అనిల్ రావిపూడి.

మహేష్-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీలో మహేష్, రాజేంద్రప్రసాద్ కలిసి పండించిన కామెడీ హైలైట్. ఇప్పుడు అభిబస్ యాడ్ కోసం అదే కాంబోని రిపీట్ చేశాడు అనిల్ రావిపూడి. ఈ యాడ్ ను మహేష్-రాజేంద్రప్రసాద్ కలయికలో ఫన్నీగా డిజైన్ చేసి.. ఆడియన్స్ అటెన్షన్ ను పట్టేశాడు.

Related Posts