‘కల్ట్’ టైటిల్ కి చాలా డిమాండ్..!

ఒక సినిమాకి కథ ఎంత ముఖ్యమో.. టైటిల్ కూడా అంతే ప్రధానం. టైటిల్ ఎంత క్యాచీగా ఉంటే ఆడియన్స్ ను అంతలా ఎట్రాక్ట్ చేయొచ్చు. అందుకే.. టైటిల్స్ విషయంలో మన మేకర్స్ ఎంతో కేర్ తీసుకుంటుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి టైటిల్ క్లాషెస్ తప్పడం లేదు. పక్కోళ్లు పెట్టుకున్న టైటిల్ నే తమ సినిమాకీ పెట్టి కాంట్రవర్శీలకు కారణమవుతున్నారు. అలాంటిదే ఇప్పుడు టాలీవుడ్ లో జరగబోతుంది.

‘బేబీ’ మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకున్న కాంబినేషన్ మళ్లీ రిపీటవుతోన్న సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా సాయిరాజేష్ దర్శకత్వంలో ఎస్.కె.ఎన్. మరో సినిమా రూపొందబోతుంది. ఈ చిత్రానికి ‘కల్ట్’ అనే టైటిల్ ను పెట్టబోతున్నట్టు అప్పట్లో నిర్మాత ఎస్.కె.ఎన్ ప్రకటించారు.

అయితే.. ‘కల్ట్’ టైటిల్ ను అంతకు ముందే హీరో విశ్వక్‌సేన్ సినిమాకోసం అనుకున్నారు. తాజుద్దీన్ అనే డైరెక్టర్ తో విశ్వక్‌సేన్ ఈ సినిమాని చేయబోతున్నాడు. అందుకు సంబంధించి టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజయ్యింది.

లేటెస్ట్ గా సీనియర్ ప్రొడ్యూసర్ సత్యనారాయణ మల్లిడి రూపొందించబోయే చిత్రానికి కూడా ‘కల్ట్ లవ్ స్టోరీ’ అనే టైటిల్ ను ఫైనలైజ్ చేశారట. గతంలో ‘బన్నీ, ఢీ’ వంటి హిట్ మూవీస్ అందించిన సత్యనారాయణ మల్లిడి కాస్త గ్యాప్ తర్వాత నిర్మిస్తున్న సినిమా ఇది. మరి.. వీరిలో ‘కల్ట్’ టైటిల్.. ఎవరికి కల్ట్ హిట్ అందిస్తుందో చూడాలి.

Related Posts