మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్‌ ‘వాల్తేర్ వీరయ్య’ సెట్ లో బాస్ పార్టీ సాంగ్ వీక్షించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్ ‘వాల్తేర్ వీరయ్య’. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెట్ లోకి ప్రత్యేక అతిథి విచ్చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమల్లు చిత్ర దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎమ్ రత్నంతో కలిసి హైదరాబాద్ లోని సెట్స్‌ను సందర్శించారు. రేపు అధికారికంగా విడుదల కానున్న బాస్ పార్టీ పాటను చూసి ఆనందించారు పవన్ కళ్యాణ్. దర్శకుడు బాబీ కొల్లి ఈ మెగా మూమెంట్ పై గొప్ప సంతోషాన్ని వ్యక్తం చేశారు. “ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకునే గొప్ప క్షణం. నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పక్కనే వున్నాను. కళ్యాణ్ గారు బాస్ పార్టీ పాటను చూశారు. కళ్యాణ్ గారికి చాలా నచ్చింది. ఆయన గొప్ప పాజిటివ్ పర్శన్, ఎన్నేళ్ళు గడిచినా అదే ప్రేమ వాత్సల్యం” అని ట్వీట్ చేశారు బాబీ. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్‌ కి వెళ్లి పాటను చూస్తున్న ఫోటోలని షేర్ చేశారు దర్శకుడు బాబీ. ఈరోజు విడుదలైన ఈ పాట ప్రోమోకు మంచి ఆదరణ లభించింది. దేవి శ్రీ ప్రసాద్ చేసిన మాస్ నంబర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాస్ పార్టీలో చిరంజీవి సరసన ఊర్వశి రౌతేలా సందడి చేయబోతుంది. నకాష్ అజీజ్, హరిప్రియతో కలిసి డీఎస్పీ పాడిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. డీఎస్పీ పాటకు సాహిత్యం కూడా రాశారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా , నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు. సాంకేతిక విభాగం: కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్ బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్ ఎడిటర్: నిరంజన్ దేవరమానే ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్ సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి సిఈవో: చెర్రీ

Read More

సాధారణంగా ఓ పెద్ద హీరో సినిమా వస్తోందంటే చిన్న హీరోలు, చిన్న సినిమాలు బరిలో నిలిచేందుకు భయపడతాయి. అలాంటిది మెగాస్టార్ లాంటి హీరో సినిమా వస్తోంటే ఇంకా ఊరూపేరూ లేని ఓ చిన్న హీరో

Read More

పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న వైబ్రేషన్ గురించి అందరికీ తెలుసు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా తరగని ఫ్యాన్స్. కమర్షియల్ గా లాస్ లు రాని ఛరిష్మా పవన్ సొంతం. కొన్నాళ్లుగా పొలిటికల్ గా

Read More

త్రివిక్రమ్ శ్రీనివాస్.. తెలుగు సినిమా రచయితగా తిరుగులేని ముద్రవేసినవాడు. పంచ్ డైలాగ్ లను పరిచయం చేసి ఆ తర్వాత అంతా తననే ఫాలోఅయ్యేలా చేసిన ప్రతిభావంతుడు. నిగూఢమైన భావాలను కూడా సింపుల్ గా చెప్పడం..

Read More

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు పెంచాడు. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్స్ లో హీట్ పెంచిన పవన్.. ఆ ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ చేసేందుకు కరెక్ట్ ప్లానింగ్ తో వెళుతున్నాడు. ముందుగా మొదలైనవి కాదని

Read More

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు చేస్తున్నా.. ఫలానా డైరెక్టర్ తో అయితే భలే ఉంటుంది అని అభిమానులు ఫీల్ అవడం కామన్. ఆ ఫలానా దర్శకుడైతే తమ హీరోను ఓ రేంజ్

Read More

యస్.. అన్నదమ్ములుగా అందరికీ ఆదర్శంగా కనిపించినట్టుగా ఉండే బ్రదర్స్ మధ్య డిఫరెన్సెస్ వచ్చాయని ఎప్పటి నుంచో అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఆ రూమర్స్ కాస్త పెరిగితే చాలు.. ఇద్దరూ కలిసి ఏదో ఒక ఫంక్షన్

Read More

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జ‌న‌గ‌ణ‌మ‌న‌. ఈ క‌థ‌ను తెర పై చూసుకోవాల‌ని.. అంద‌రికీ చూపించాల‌ని ఎప్ప‌టి నుంచో త‌పిస్తున్నారు కానీ.. అనుకున్న‌ట్టుగా జ‌ర‌గ‌డం లేదు. సూప‌ర్ స్టార్

Read More

అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి అని సినిమావాళ్ల విషయంలో ఎక్కువగా జరుగుతుంటుంది. సినిమాలపై అంచనాల నుంచి రిలీజ్ డేట్స్ వరకూ వాళ్లు ఊహించేది ఒకటైతే ఫైనల్ గా కనిపించేది మరోటి అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి.

Read More

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి స్క్ర్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్

Read More