పవన్ కళ్యాణ్ ను నిలదీసిన దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు చేస్తున్నా.. ఫలానా డైరెక్టర్ తో అయితే భలే ఉంటుంది అని అభిమానులు ఫీల్ అవడం కామన్. ఆ ఫలానా దర్శకుడైతే తమ హీరోను ఓ రేంజ్ లో చూపిస్తాడు అనేదే వారి ఫీలింగ్. అలాంటి డైరెక్టర్ ఎప్పుడో ఫిక్స్ అయినా.. ఎందుకో డేట్స్ ఇవ్వడం లేదు పవర్ స్టార్. దీంతో ఆ డైరెక్టర్ వెళ్లి డేట్స్ ఇస్తారా లేక మరో సినిమా చేసుకోనా అనేశాడట.. దీంతో పవన్ కళ్యాణ్ కూడా అదే టోన్ తో ఓ డైలాగ్ అన్నాడట. కట్ చేస్తే.. ఏమై ఉంటుందా అనుకుంటున్నారా..? మీరే చూడండి.

ఊహించినట్టుగానే ఆ దర్శకుడు హరీష్ శంకరే. ఒకప్పుడు వరుస ఫ్లాపులు, డిజాస్టర్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ లోని పవర్ ను పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేసి ఆ పవర్ ను బాక్సాఫీస్ కు గబ్బర్ సింగ్ లా చూపించాడు హరీశ్ శంకర్. అప్పటి నుంచి హరీష్ తో మరోసారి సినిమా ఎప్పుడు ఉంటుందా అని పవన్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. చాలాకాలం వెయిట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ హరీశ్ శంకర్ తో సినిమాకు ఓకే చెప్పాడు పవన్ కళ్యాణ్. మంచి స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకుని పవన్ తో ఓకే కూడా చేయించుకున్నాడు హరీశ్. కానీ ఇక్కడే కథ కరోనాలో పడింది.

కరోనా రావడంతో ఈ సినిమా అనుకున్నదానికంటే చాలా ఆలస్యం అయింది. అదీ కాక మళ్లీ ఎప్పుడు మొదలవుతుంది అనే క్లారిటీ కూడా ఎవరిలో లేదు. ఈ మూవీకి ఓకే చెప్పిన తర్వాతే ఒప్పుకున్న భీమ్లా నాయక్ ఆల్రెడీ రిలీజ్ కూడా అయింది. కానీ హరీష్ మేటర్ తేలడం లేదు. ఇక రీసెంట్ గా పవన్ క్రిష్ డైరెక్షన్ లో హరిహరివీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరోవైపు ఓ తమిళ్ సినిమా రీమేక్ లో నటిస్తాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో అసలు తన ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందో ఓ క్లారిటీ ఇస్తే బావుంటుంది అని నేరుగా పవన్ నే అడిగాడట హరీష్.

హరీశ్ శంకర్ కూడా ఈ మూవీ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు. మరీ ఎక్కువ లేట్ అయినా ఇబ్బందే కదా..? అందుకే ఈ లోగా ఓ చిన్న సినిమా చేసుకునే అవకాశం ఉందనే విషయం పవన్ కు చెప్పాడట. సిట్యుయేషన్ అర్థం చేసుకున్న పవర్ స్టార్.. చిన్న సినిమా వద్దు.. ఈ ప్రాజెక్ట్ కే షెడ్యూల్స్ రెడీ చేసుకోమని ఊహించని విధంగా చెప్పాడట. ప్రస్తుతం హరీశ్ ఆ పనిలోనే ఉన్నాడు. పైగా ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లున్నారట. ఇప్పుడు వారిని ఫైనల్ చేసుకుంటూ.. షెడ్యూల్ వేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడట. సో.. హరిహర తర్వాత హరీశ్ తోనే సినిమా ఉంటుందన్నమాట.

Related Posts