పవన్ పేరుతో చీప్ ట్రిక్స్ అవసరమా మహేష్ ..?

పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న వైబ్రేషన్ గురించి అందరికీ తెలుసు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా తరగని ఫ్యాన్స్. కమర్షియల్ గా లాస్ లు రాని ఛరిష్మా పవన్ సొంతం. కొన్నాళ్లుగా పొలిటికల్ గా బిజీగా ఉన్నా.. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి చిత్రాలతో సత్తా చాటాడు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఏపి ప్రభుత్వం ఇబ్బంది పెట్టకపోతే.. ఈ రెండు సినిమాలు రికార్డ్స్ క్రియేట్ చేసేవి అని అందరికీ తెలుసు. అంత ఛరిష్మా ఉంది కనుకే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ఆ పేరును వాడుకుని చీప్ పబ్లిసిటీ పొందాలని చూస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు ఆచార్య ఆరంభం అయితే సర్కారు వారి పాట కంటిన్యూ చేస్తోంది.

ఎంత పెద్ద స్టార్ హీరో ఫంక్షన్ కైనా చీఫ్ గెస్ట్ అనే మాట ఖచ్చితంగా ఉంటుంది. ఈ మాటకు చాలా వరకూ పవన్ కళ్యాణ్ అతీతం. అతని సినిమా ఫంక్షన్స్ కు పెద్ద గెస్ట్స్ లు అరుదుగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఇతర సినిమాల ఫంక్షన్స్ కు వెళితే మాత్రం చిన్న హీరో అయినా ఆ ఫంక్షన్ పెద్ద హీరో ఫంక్షన్ లా మారుతుంది. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఈ సత్యాన్ని అడ్డుపెట్టుకుని ఈ మధ్య చాలామంది చీప్ గా అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. అదేంటంటే.. తమ సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ వస్తున్నాడనేదే ఆ ప్రచారం. లేదంటే ఆ సినిమాలకు పెద్దగా బజ్ రావడం లేదు. జనాల్లో ఊపు కనిపించడం లేదు. రిలీజ్ కు ముందే ఊపు లేకపోతే బాక్సాఫీస్ దగ్గర ఇంకేం కనిపిస్తుంది. ఆ మధ్య అస్సలే మాత్రం బజ్ లేని ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ వస్తున్నాడనే ప్రచారంతో అభిమానుల్లో ఓ రేంజ్ లో సందడి కనిపించింది. తీరా అదే రోజు ఆయన రావడం లేదు అని చెప్పారు. నిజానికి ఆయన ఆ ఫంక్షన్ కు వెళ్లాలనుకోలేదు. అది మేకర్స్ కు, ఈవెంట్ ఆర్గనైజర్స్ కూ తెలుసు.

ఇక లేటెస్ట్ గా మహేష్ బాబు మూవీ మేకర్స్ సైతం పవన్ పేరును వాడుతూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మహేష్ బాబు సర్కారువారి పాట మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ బాబు వస్తున్నాడనే ప్రచారం మొదలుపెట్టారు. దీంతో చాలామంది అభిమానులు ఇది నిజమే అనుకుని సంబర పడుతున్నారు. కానీ ఈ ఈవెంట్ కు క్రేజ్ తేవడం కోసం సర్కారువారి పాట మేకర్స్ చేస్తోన్న చీప్ పబ్లిసిటీ తప్ప ఇందులో నిజం లేదు. మరి మహేష్ బాబు లాంటి టాప్ స్టార్ కూడా ఉన్న సినిమాకు పవన్ కళ్యాణ్ పేరును వాడుతూ చీప్ పబ్లిసిటీ చేసుకుంటూ అటు మహేష్ ఫ్యాన్స్ ను ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేయడం ఏంటో కానీ.. ఈ మధ్య ప్రతోడూ.. పవన్ పేరును తెగ వాడేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

Related Posts