పవన్ కళ్యాణ్ ను పక్కన బెట్టిన మెగాస్టార్

యస్.. అన్నదమ్ములుగా అందరికీ ఆదర్శంగా కనిపించినట్టుగా ఉండే బ్రదర్స్ మధ్య డిఫరెన్సెస్ వచ్చాయని ఎప్పటి నుంచో అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఆ రూమర్స్ కాస్త పెరిగితే చాలు.. ఇద్దరూ కలిసి ఏదో ఒక ఫంక్షన్ లో కలుసుకుని రెండు మూడు స్టిల్స్ బయటకు వదులుతారు. అంతే.. ఇద్దరి మధ్యా ఏం లేదు.. అంతా మీడియా సృష్టే అంటూ నింద ఇటు వైపు వేస్తారు. కానీ తాజా సీన్ చూస్తే.. ఆ మాటకొస్తే చాలా సీన్స్ ఉన్నాయి.. ఈ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని మరోసారి స్పష్టం అవుతుంది. ఇక మరోసారి అది ప్రూవ్ అయ్యేందుకు ఆచార్య వేదిక కాబోతోంది.

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 29న విడుదల కాబోతోంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కు గొప్ప రెస్పాన్సేం రాకపోయినా.. ఇద్దరు స్టార్స్ ఉన్నారు కాబట్టి అంచనాలున్నాయీ సినిమాపై. అద్సరే.. పవన్ కళ్యాణ్, చిరంజీవి మధ్య గొడవకు ఈ సినిమాకు కారణం ఎలా అవుతుంది..? అంటారా..

29న విడుదల కాబోతోన్న ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ సారి ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ప్రోగ్రామ్ ఉండబోతోంది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్.. ఏపి సిఎమ్ జగన్మోహన్ రెడ్డిని చీఫ్ గెస్ట్ గా పిలవబోతున్నాడుట. ఇప్పటికే జగన్ కు పవన్ కు మధ్య పొలిటికల్ వైరం ఎంత ఉందో అందరికీ తెలుసు. పొలిటికల్ గానే కాదు.. ఇద్దరూ వ్యక్తిగతంగానూ విమర్శలు చేసుకున్నారు. అలాంటి వ్యక్తిని తన సినిమా ఫంక్షన్ కు పిలవడం అంటే ఇన్ డైరెక్ట్ గా పవన్ పోరాటాన్ని మెగాస్టార్ పట్టించుకోవడం లేదు అనే కదా..? అసలు పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీని చిరంజీవి ఏనాడూ పట్టించుకోలేదు. ఎప్పుడూ ఎక్కడా.. తన తమ్ముడు ఏదో అయిపోతాడు అని చెప్పలేదు. కాకపోతే అతనికి ప్రశ్నించే గుణం, సాయం చేసే గుణం ఉందని మాత్రం పొగుడుతుంటాడు.

ఇప్పుడు చీఫ్ గెస్ట్ గా పిలవడమే కాదు.. ఆ మధ్య టికెట్ రేట్ల వ్యవహారంలో కూడా పవన్ ఒక రూట్ ఎంచుకుంటే చిరంజీవి మరో రూట్ ఎంచుకున్నాడు. ఆ రూట్స్ ఎలా ఉన్నా.. టికెట్ రేట్ల వ్యవహారాన్ని క్లియర్ చేసింది మాత్రం మెగాస్టారే అనేది సత్యం. తన స్టామినా తెలుసు కాబట్టే.. చిరంజీవి పవన్ కళ్యాణ్ ను పెద్దగా పట్టించుకోడు అనేది ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. మొత్తంగా ఈ ఆచార్య సినిమా వీరి మధ్య ఉన్న భేదాభిప్రాయాలను మరోసారి బయట పెట్టబోతోందంటున్నారు చాలామంది. ఏదేమైనా పవన్ కు ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్, ఫ్యామిలీ లేదు అనేది మాత్రం వాస్తవం అని కూడా అనుకుంటున్నారు.

Related Posts