HomeSocial Media'నాటు నాటు' పాటకు స్టెప్పులేసిన ఖాన్ త్రయం

‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేసిన ఖాన్ త్రయం

-

బాలీవుడ్ లో ఖాన్ త్రయంగా చెప్పబడే.. సల్మాన్, అమిర్, షారుఖ్ ఖాన్ ల ఆధిపత్యానికి తిరుగేలేదు. రెండున్నర దశాబ్దాలుగా హిందీ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు వచ్చినా.. అగ్ర స్థానం మాత్రం ఈ ముగ్గురు ఖాన్ లతోనే దోబూచులాడుతూ వచ్చింది. ఈ ఖాన్ త్రయం ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు చాలా అరుదు. ఇక.. లేటెస్ట్ గా అలాంటి సందర్భం వచ్చింది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో ఖాన్ త్రయం చేసిన సందడి అంతా ఇంతా కాదు. అంబానీల పెళ్లి సందడిలో అమీర్, సల్మాన్, షారుక్ కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలోని ‘నాచో నాచో’ పాటకు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇవీ చదవండి

English News