సుహాస్ సరికొత్త ప్రయోగం ‘ప్రసన్నవనదం’

నాని తర్వాత అలాంటి నేచురల్ పెర్ఫామెన్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సుహాస్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న సుహాస్ కి గత చిత్రం ‘శ్రీరంగనీతులు’ ఆశించిన విజయాన్ని అందించలేదు. అయితే.. ఇప్పుడో ప్రయోగాత్మక సినిమా ‘ప్రసన్నవదనం’తో ప్రేక్షకుల్ని మెప్పిస్తాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. సుకుమార్ శిష్యుడు అర్జున్ వై.కె. తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మణికంఠ జె.ఎస్, ప్రసాద్ రెడ్డి టి.ఆర్ నిర్మించారు. ఈ మూవీలో సుహాస్ కి జోడీగా పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ నటించారు. ఇతర కీలక పాత్రల్లో నందు, వైవా హర్ష ఇతర కీ రోల్స్ లో కనువిందు చేయబోతున్నారు.

లేటెస్ట్ గా ‘ప్రసన్నవదనం’ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది. ఫేస్ బ్లైండ్ నెస్ వ్యాధితో బాధపడే వ్యక్తిగా ఈ సినిమాలో హీరో సుహాస్ కనిపించబోతున్నాడు. మనుషుల మొహాలను గుర్తించలేకపోవడం అనేది అతని వ్యాధి. ఈ కోవలో ఓ రాత్రి హత్యను ప్రత్యక్షంగా చూడడం.. హంతకులను పట్టించేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆ తర్వాత అతను ఎదుర్కొన్న పరిణామాల నేపథ్యంలో ‘ప్రసన్నవదనం’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి ‘బేబి’ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మే 3న ‘ప్రసన్నవదనం’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts