‘కల్కి’ కొత్త విడుదల తేదీ ఫిక్సైంది?

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి’ సినిమా ఎప్పుడెప్పుడు వస్తోందా? అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మే 9న ఈ సినిమా రావడం లేదని క్లారిటీ వచ్చేయడంతో.. మరి ‘కల్కి’ కొత్త విడుదల తేదీ ఏంటనే ఆరాలు మొదలయ్యాయి. చిత్రబృందం నుంచి అధికారికంగా ప్రకటన ఇంకా రాకపోయినా.. ‘కల్కి’ జూన్ లో రావడం పక్కా అనే సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యంగా.. జూన్ 27న ‘కల్కి 2898 ఎడి’ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుందట టీమ్.

జూన్ నెలలో ఆల్రెడీ కమల్ హాసన్-శంకర్ ‘ఇండియన్ 2’ విడుదలకు ముస్తాబవుతోంది. ‘ఇండియన్ 2’కి కూడా ఇంకా విడుదల తేదీ ఖరారు చేయలేదు. విశ్వనటుడు కమల్ హాసన్ ‘కల్కి’ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఒకవేళ ‘కల్కి’ జూన్ కే ఫిక్సైతే.. కమల్ నటించిన రెండు సినిమాలు ఒకే నెలలో విడుదలైనట్టు అవుతోంది. ఈ వారంలోనే ‘కల్కి’ కొత్త తేదీపై క్లారిటీ ఇవ్వనుందట నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.

Related Posts