మరోసారి థియేటర్లలోకి వస్తోన్న ‘వకీల్ సాబ్’

‘అఙ్ఞాతవాసి’ తర్వాత అసలు సినిమాలే చేస్తాడో? లేదో? అనే సస్పెన్స్ కు తెరదించుతూ 2021లో ‘వకీల్ సాబ్’తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బాలీవుడ్ మూవీ ‘పింక్’ రీమేక్ గా వేణు శ్రీరామ్ తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీ కోవిడ్ టైమ్ లో సైతం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో లాయర్ పాత్రలో పవన్ చెలరేగిపోయాడు. తనదైన పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ తో సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేశాడు.

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలోనూ రీ-రిలీజుల ట్రెండ్ జోరందుకుంది. ఈకోవలోనే ఇప్పుడు ‘వకీల్ సాబ్’ను మళ్లీ రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. మే 1న ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లోకి దింపేందుకు సిద్ధమవుతున్నాడట స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇప్పటికే పవన్ నటించిన కొన్ని సినిమాలు రీ-రిలీజుల్లోనూ కోట్లు కురిపించిన సంగతి తెలిసిందే.

Related Posts