డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్.. చిరంజీవి పోస్ట్ వైరల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ముందు ఇప్పుడు డాక్టరేట్ చేరింది. చెర్రీ ఇప్పుడు డాక్టర్ రామ్ చరణ్ అయ్యాడు. చెన్నైకు చెందిన వేల్స్‌ విశ్వవిద్యాలయం రామ్ చరణ్ కి గౌరవ డాక్టరేట్ అందించింది. కళారంగానికి చేసిన విశేష సేవలకు గానూ ఈ గౌరవం దక్కింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ సందర్భంగా రామ్‌ చరణ్ చెన్నై గురించి ప్రత్యేకంగా ముచ్చటించాడు. చెన్నై తనకెంతో ఇచ్చిందని.. మెగాస్టార్ తన సినీ ప్రయాణాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించారని.. ఉపాసన వాళ్లు అపోలో హాస్పిటల్స్‌ను కూడా ప్రారంభించింది ఇక్కడి నుంచే అని.. చెన్నైతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు. అలాగే.. తన అప్ కమింగ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ గురించి ఆసక్తికర విశేషాలు వెల్లడించాడు చరణ్. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ‘గేమ్ ఛేంజర్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలిపాడు.

రామ్‌ చరణ్‌ డాక్టరేట్‌ అందుకోవడంపై చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ‘వేల్స్‌ విశ్వవిద్యాలయం రామ్‌ చరణ్‌కు డాక్టరేట్‌ అందించడం చూసి తండ్రిగా గర్వపడుతున్నా. ఇవి భావోద్వేగంతో కూడిన క్షణాలు. చెప్పలేనంత ఆనందంగా ఉంది. పిల్లలు విజయాలను సాధిస్తున్నప్పుడే తల్లిదండ్రులకు నిజమైన ఆనందం. లవ్‌యూ మై డియర్‌ డాక్టర్‌ రామ్‌ చరణ్‌’ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్‌ చేశారు మెగాస్టార్.

Related Posts