మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి మెగా స్పీచ్

తెలుగు డిజిటల్ మీడియా ఫెవడేరషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఒరిజిన్ డే’ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సందడి చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ హోస్ట్ గా వ్యవహరించి చిరంజీవిని పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. ఈ సందర్భంలో మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి మెగాస్టార్ చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

‘తమ ఇంట్లో అందరూ లైట్లు ఆన్ చేసి వదిలేస్తారని.. అలాగే గీజర్ ఆన్ చేసి వదిలేస్తారు అని.. ఇక.. చరణ్ బ్యాంకాక్ వెళ్తూ అయిదు లైట్లు ఆన్ చేసి వెళ్లిపోయాడు.. వాటిని తానే ఫోన్ యాప్ ద్వారా ఆపుతుంటానని’ ఈ సందర్భంగా చిరంజీవి చెప్పారు. ఇక.. ‘అయిపోయిన సోప్ లు అన్నీ కలిపి కంప్రెస్ చేసి అదో కొత్త సోప్ లా తయారు చేసి వాడుతుంటానని.. షాంపూ సీసా అయిపోతే చివర్లో దాంట్లో నీళ్లు పోసి కలిపి వాడి అప్పుడు బయట పడేస్తాను’ అంటూ తనలో ఉన్న మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి ఈ సందర్భంగా తెలియజేశారు

Related Posts