పెళ్లి పీటలు ఎక్కబోతున్న వరలక్ష్మి శరత్ కుమార్

వరలక్ష్మి శరత్ కుమార్ అంటే ఓ తమిళ అమ్మాయి అనుకోరు ఎవరూ.. అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయి అనుకుంటారు. ఎందుకంటే తమిళం కంటే ఎక్కువగా తెలుగులో చిత్రాలు చేస్తుంది. పైగా.. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. వరలక్ష్మి సినిమాల స్పీడు గురించి పక్కనపెడితే.. ఈ ముద్దుగుమ్మ తన పెళ్లి విషయంలో అందరికీ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఓ ముంబయి వ్యాపారవేత్తతో సైలెంట్ గా నిశ్చితార్థం పూర్తిచేసుకుంది.

ముంబయికి చెందిన వ్యాపారవేత్త నికోలాయ్ సచ్ దేవ్ తో వరలక్ష్మి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ ముంబయిలో ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకలో వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ తో పాటు రాధిక కూడా సందడి చేసింది. ఈ నిశ్చితార్థ వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది వరలక్ష్మి శరత్ కుమార్.

Related Posts