క్లాసికల్ డ్యాన్స్ తో మెస్మరైజ్ చేసిన శ్రీలీల

ఈ జెనరేషన్ హీరోయిన్స్ లో డ్యాన్సులంటే ముందుగా గుర్తుచ్చే పేరు శ్రీలీల. ‘గుంటూరు కారం’ సినిమాలో కుర్చీ మడతపెట్టి గీతంలో శ్రీలీల వేసిన మాస్ స్టెప్పుల గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీలీల తో డ్యాన్స్ అంటే హీరోలకు తాట ఊడిపోద్ది అన్న రీతిలో ఏకంగా మహేష్ బాబు కూడా ఆమె డ్యాన్సుల గురించి ప్రశంసలు కురిపించాడు. వెస్టర్న్ డ్యాన్స్ లో ఎలాగూ దుమ్మురేపే శ్రీలీల.. క్లాసికల్ డ్యాన్స్ లోనూ అదరగొడుతోంది.

చిన్నప్పట్నుంచే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న శ్రీలీల తాజాగా తన నాట్య ప్రావీణ్యతను ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఇటీవల జరిగిన సమత కుంభ్‌-2024 వేడుకల్లో శ్రీలీల ఇచ్చిన క్లాసికల్ డ్యాన్స్ ప్రదర్శన ఆహూతులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. శ్రీలీల కూడా తన క్లాసికల్ పెర్ఫామెన్స్ గురించి వివరాలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

Related Posts