వెయ్‌ దరువెయ్‌ రివ్యూ

సాయిరామ్‌ శంకర్‌ చాలా కాలం తర్వాత హీరోగా చేసిన సినిమా వెయ్‌ దరువెయ్‌. యషా శివకుమార్, హెబ్బా పటేల్‌ లు ఫిమేల్ లీడ్ చేసారు. నవీన్ రెడ్డి డైరెక్షన్‌లో దేవరాజ్ పోతూరు నిర్మించిన ఈ చిత్రం ప్రమోషనల్ వీడియోస్‌తో మంచి హైప్ తెచ్చుకుంది. అందుకు తగ్గట్టు సినిమా సక్సెస్‌ అయ్యిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం

కథ – కామారెడ్డి కుర్రాడు శంకర్ (సాయిరామ్‌ శంకర్) సరదాగా జులాయి గా తిరగడం తప్ప జాబ్ ఉండదు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి తన ఫ్రెండ్ సత్యం రాజేష్ దగ్గర ఉంటుంటాడు. అయితే జాబ్ అంత ఈజీగా రాదు. ఫేక్ సర్టిఫికెట్ తో ఉద్యోగం సంపాదించొచ్చు అని భావిస్తాడు. ఆ క్రమంలోనే శృతి (యషా శివకుమార్ ) పరిచయం అవుతుంది. అది ప్రేమగా మారుతుంది. ఆమె కూడా ఫేక్ సర్టిఫికెట్‌తోనే జాబ్ పొందాలనుకుంటుంది. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న అసలు సమస్య ఏంటి ? ఎలా పరిష్కరించుకున్నారేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ – జులాయిగా తిరిగే కుర్రాడు సిటీకి రావడం.. హీరోయిన్ తండ్రో, బాబాయో ఛాలెంజ్ చేయడం.. అక్కడి నుంచి హీరో మారిపోయి ప్రయోజకుడవ్వడం లాంటి సినిమాలు ఎప్పటినుంచో వస్తున్నవే. హైదరాబాద్ ఉపాధి కోసం ఎలాంటి వారు వచ్చి చక్రం తిప్పుతున్నారో చూడొచ్చు. అలాగే చదువుకోకుండా అడ్డదారుల్లో ఫేక్ సర్టిఫికెట్స్ పొంది ఉద్యోగాలు పొందితే కటకటాలపాలు కాకతప్పదని మెసేజ్ ఇచ్చారు. అలాగే నిరాశలో ఉన్న యువతను క్యాష్ చేసుకోవడానికి వారికి ఫేక్ సర్టిఫికెట్స్ తయారుచేసి ఇచ్చి… సొమ్ము చేసుకుంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఓ హాస్పిటల్ ఇన్సిడెంట్, ఓ కుంగిన ఫ్లై ఓవర్ కారణంగా కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తి జీవితం… ఇలా మెసేజ్ రూపంలో ఆడియన్స్ కు ఇచ్చారు దర్శకుడు.
అడ్డదారుల్లో అక్రమ సంపాదన ఎప్పటికైనా ముప్పే అని చూయిస్తందీ చిత్రం.

నటీనటులు – హీరోగా సాయిరామ్‌ శంకర్‌ ప్లే చేసిన క్యారెక్టర్ అతనికి కొట్టినపిండే. ఇప్పు డు కొత్తసై ల్లో ప్రూవ్ చేసాడు. అలాగే యాక్షన్ సన్నివేశాల్లో ఫుల్ ఎనర్జీ చూపించారు. అతనికి జోడీగా నటించిన యషా శివకుమార్ తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. అలాగే గాయత్రి భార్గవి చక్కని మార్క్‌ వేసింది. ఫేక్ సర్టిఫికెట్‌లు సప్లై చేసే క్రమంలో దేవరాజ్‌ పోతూరి కనిపిస్తారు. మిగతా నటీనటులుఉన్నంతలో భాగా చేసాడు.

టెక్నిషియన్స్‌ – నవీన్ రెడ్డిరాసుకున్న ఈ కథను అత్యంత ఆసక్తికరంగా డిజైన చేసాడు. స్క్రీన్‌ ప్లే చక్కగా కుదిరింది. భీమ్స్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మార్కు మ్యూజిక్ ఇందులో కూడా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. సాయిరామ్ శంకర్, యషా శివకుమార్ జోడీని అందంగా చూపించారు. తక్కువ టైమ్‌లో షూట్ చేసినా ప్రొడక్షన్ వేల్యూస్ చక్కగా ఉండటంలో దేవరాజ్ పోతూరి పాత్ర కీలకం.

రేటింగ్ – 2/ 5

బోటమ్‌ లైన్ – ఆకట్టుకునే వెయి్‌ దరువెయ్‌

Related Posts