బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేసిన శ్రుతి

స్టార్ డాటర్ శ్రుతి హాసన్ అఫైర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సౌత్ టు నార్త్ ఒకరిద్దరు నటులతో రిలేషన్ షిప్ లో ఉన్న శ్రుతి.. ఆ తర్వాత బ్రిటీష్ యాక్టర్ మైఖేల్ కోర్సలే తో కొన్నాళ్లపాటు ప్రేమలో మునిగితేలింది. మైఖేల్ తో విడిపోయిన తర్వాత డూడ్ల్ ఆర్టిస్ట్ శాంతను హజారిక తో ప్రేమలో పడింది. చాన్నాళ్లుగా వీరిద్దరూ కలిసి జీవనం సాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు శాంతను కి సంబంధించిన అప్డేట్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే వచ్చింది శ్రుతి హాసన్.

లేటెస్ట్ గా బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికకు బ్రేకప్ చెప్పేసిందట శ్రుతి. సోషల్ మీడియా అక్కౌంట్స్ లో వీరిద్దరూ అన్ ఫాలో అయిపోయారు. అలాగే.. తన ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్ నుంచి శాంతనుకి సంబంధించిన ఫోటోలన్నీ డిలీట్ చేసింది. కారణాలైతే తెలీవు కానీ.. శ్రుతి-శాంతను బ్రేకప్ నిజమేనంటున్నాయి సినీ వర్గాలు.

Related Posts