పోస్ట్ ప్రొడక్షన్‌ లో ‘ఒసేయ్ అరుంధతి’

విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో గూడూరు ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఒసేయ్ అరుంధతి.వెన్నెల కిషోర్, కమల్ కామరాజు, మోనికా చౌహాన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోందీ చిత్రం.విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
కమల్ కామరాజు, వెన్నెల కిషోర్, మోనికలతో ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా ‘ఒసేయ్ అరుంధతి’ సినిమాను నిర్మిస్తుండటం ఆనందంగా ఉందన్నారు నిర్మాత ప్రణయ్‌ రెడ్డి.


ఒసేయ్ అరుంధతి.. హైదరాబాద్ లో పిల్లాడితో పాటు బ్రతికే మధ్యతరగతి ఇల్లాలి కథ అన్నారు దర్శకుడు విక్రాంత్ కుమార్. ఓసారి సత్యనారాయణ స్వామి వత్రం చేయాలని అనుకుంటుంది. అయితే అనుకోకుండా అరుంధతికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తనని తాను కాపాడుకుంటూ ఇంటి పరువును ఎలా కాపాడుకుంటుందనేదే ఈ సినిమా అన్నారు దర్శకుడు విక్రాంత్ కుమార్.
వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు, పృథ్వీరాజ్, చిత్రం శ్రీను, అరియానా గ్లోరి, సునీతా మనోహర్, టార్జాన్ ఈ సినిమాలో నటిస్తున్నారు

Related Posts