ఇంతకీ కోలీవుడ్ కండీషన్స్ ఏంటీ..

సినిమాల విషయంలో తమిళనాడు వాళ్లు తీసుకున్న నిర్ణయాలు బాలేదు. సంకుచితంగా ఆలోచిస్తున్నారు. వాళ్లు మారాలి. మరోసారి తమ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి. వాళ్లు కూడా ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు చేయాలి అంటూ రీసెంట్ గా బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కోలీవుడ్ మేకర్స్ కు సూచనలు చేయడం సెన్సేషన్ అయింది.ఇండస్ట్రీ పీపుల్ కు తమిళనాడు వాళ్లు ఏం చేశారు అనేది అందరికీ తెలుసు.

కానీ కామన్ ఆడియన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకు అలా మాట్లాడాడు. అక్కడ ఉన్న సమస్య ఏంటీ అనుకుంటున్నారు. మరి పవన్ అలా ఎందుకు మాట్లాడాడు. తమిళనాడు వాళ్లు పెట్టుకున్న కండీషన్స్ ఏంటీ అంటే.. ఇది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా(ఫెఫ్సీ) నేతృత్వంలో తీసుకున్న నిర్ణయం. దానికి అధ్యక్షుడు రోజా భర్త సీనియర్ డైరెక్టర్ ఆర్కే సెల్వమణి కావడం విశేషం. ఇందులో వీరు ప్రధానంగా నాలుగు కండీషన్స్ పెట్టారు. అవేంటో చూద్దాం.

  1. తమిళ సినిమాల్లో ఆ రాష్ట్రానికి చెందిన ఆర్టిస్టులను మాత్రమే తీసుకోవాలి. వేరే వారిని తీసుకోకూడదు.
  2. తమిళ సినిమా షూటింగ్స్ అన్నీ రాష్ట్ర పరిధిలోనే చేసుకోవాలి. ఖచ్చితంగా బయటే తీయాలి అనిపిస్తే తప్ప రాష్ట్రం, దేశం దాటి బయటకు వెళ్లొద్దు.
  3. ఒక సినిమా షూటింగ్ ను దర్శకుడు తను చెప్పిన టైమ్ లోగా పూర్తి చేయకపోతే అతనిపై నిర్మాతలు కంప్లైంట్ చేయొచ్చు.
  4. దర్శకుడే కథ రాసుకుంటే.. ఆ కథకు సంబంధించి కాపీరైట్ వివాదాలన్నీ అతనే పరిష్కరించుకోవాలి. నిర్మాతకు ఏ సంబంధం ఉండదు.

ఇవీ ఆ కండీషన్స్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆర్టిస్టులు ఇతర భాషా సినిమాల్లో నటిస్తూ భాష అనే బౌండరీస్ ను దాటేస్తున్నారు.అందుకే ప్యాన్ ఇండియన్ సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తమిళ సినిమాల్లో తమిళ్ వారినే తీసుకోవాలి అనే నిర్ణయమే ఫూలిష్ గా ఉంది.

ఒకప్పుడు తెలుగు వారి విషయంలోనూ ఇలాగే చేశారు. అక్కడ షూటింగ్స్ చేసుకునేవారు కాబట్టి.. తెలుగు సినిమా అయినా సరే వాళ్లు ఏడుగురు, తెలుగువాళ్లు ముగ్గురు అనే రేషియోలో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ను తీసుకునేవారు. ఈ కారణంగానే మనవారికి సరిగా అవకాశాలు వచ్చేవి కావు. ఇక ఇప్పుడు తమిళ్ సినిమాలో తమిళ్ ఆర్టిస్టులే ఉండాలనుకోవడం.. ఇండియన్ సినిమా స్థాయి అంతర్జాతీయ స్థాయిలో వెలుగుతున్న తరుణంలో తమిళనాడులోనే షూటింగ్స్ చేయాలనుకోవడం ఓ రకంగా దారుణమైన నిర్ణయం అనే చెప్పాలి.
ఇలా చేయడం వల్ల నిర్మాతల బడ్జెట్ కంట్రోల్ అవుతుంది అనేది ఫెఫ్సీ వాదన. కానీ క్వాలిటీ పోతుంది కదా అనేది డైరెక్టర్స్ ఫీలింగ్.


అందుకే సినిమాలను కూడా తమిళనాడు దాటి బయటి రాష్ట్రాల్లో విడుదల చేయకూడదు అనే కండీషన్ కూడా పెడితే పోయేది కదా అని సాధారణ జనం విమర్శలు చేస్తున్నారు. మరి పవన్ సూచనతో కోలీవుడ్ లో ఈ నిర్ణయంపై సమీక్ష జరుగుతుందా లేదా అనే ఆలోచనే అక్కర్లేదు. ఎందుకంటే వాళ్లు తిరిగి పవన్ కే కౌంటర్స్ వేస్తున్నారు. మా నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు అంటున్నారు. సో వాళ్లు మారరు అన్నమాట.

Related Posts