కీరవాణి కొడుకు సాహసం చేస్తున్నాడా ..

కీరవాణి తనయుడు అనే బ్యాక్ కార్డ్ తో హీరోగా ఎట్రీ ఇచ్చాడు శ్రీ సింహా. ఫస్ట్ మూవీ మత్తు వదలరా ఆకట్టుకుంది. కానీ కమర్షియల్ గా పెద్ద విజయం కాదు. తర్వాత చేసిన సినిమాలన్నీ వరుసగా పోతున్నాయి. రీసెంట్ గా కూడా భాగ్ సాలే అంటూ వచ్చాడు. ఇది జనం పరుగులుపెట్టారు.అతని నెక్ట్స్ మూవీ ఉస్తాద్.

మసూద, బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ కథనాయికగా నటించిన ఈ సినిమా టీజర్ తో పాటు పాటలు చాలా బావున్నాయి. ఈ ఇద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరినట్టు కనిపిస్తోంది.ఓ మంచి ప్రేమకథా చిత్రంగానూ అనిపిస్తోంది. ఇంకా ట్రైలర్ తో పాటు మిగతా పాటలు రాకుండానే ప్రామిసింగ్ ప్రాజెక్ట్ అనిపిస్తోంది ఉస్తాద్. అలాంటి సినిమాను కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని సరైన రిలీజ్ డేట్ చూసుకుని విడుదల చేస్తే బావుంటుంది. కానీ వీళ్లు మాత్రం ఏకంగా కొండనే ఢీ కొట్టబోతున్నారు.


ఉస్తాద్ చిత్రాన్ని ఆగస్ట్ 12న విడుదల చేయబోతున్నాం అని అనౌన్స్ చేశారు. కానీ ఆ ముందు రోజే మెగాస్టార్ భోళా శంకర్ తో పాటు రజినీకాంత్ జైలర్ కూడా వస్తున్నాయి.ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే ఇంక ఉస్తాద్ ను పట్టించుకుంటారా..? అసలే కుర్రాడు ఇంకా ఎవరికీ రిజిస్టర్ కూడా కాలేదు. కేవలం కీరవాణి తనయుడు అనే ట్యాగ్ తప్ప మరోటి కనిపించడం లేదు. పోనీ రాజమౌళి, కీరవాణి లాంటి వాళ్లు ముందుకొచ్చి ప్రమోషన్ చేస్తారా అంటే మనోడి టాలెంట్ తెలుసు కాబట్టి వాళ్లు ముందుకు రావడం లేదు. మరి ఇన్ని సమస్యలున్నప్పుడు సరైన ప్లానింగ్ ఉండాలి కదా.. సో.. ఎలా చూసినా కాస్త పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఉస్తాద్ ను ఆగస్ట్ 12న విడుదల చేయడం సేఫ్ కాదేమో.

Related Posts