మంగళవారం టెలివిజన్‌ షో బ్లాక్‌బస్టర్‌

‘మంగళవారం’ ఈమధ్య కాలంలో సెన్సేషన్‌ క్రియేట్ చేసిన మూవీ. ఆర్‌ఎక్స్‌ 100 మూవీతో డైనమిక్ డైరెక్టర్‌ గా పేరు తెచ్చుకున్న అజయ్‌ భూపతి డైరెక్ట్ చేసిన ఈ మూవీ అనౌన్స్‌మెంట్ నుంచే భారీ బజ్‌ క్రియేట్ చేసింది. రిలీజ్‌ అయ్యాక నిర్మాతలు స్వాతి గునుపాటి, సురేష్‌వర్మలకు అంతే స్థాయిలో వసూళ్లు కురిపించింది. విమర్శకుల ప్రశంసలు పొందింది. ఓటీటీలో రిలీజయి అక్కడా సెన్సేషనల్‌ హిట్ అయ్యింది.


పాయల్‌ రాజ్‌పుత్‌ మెయిన్‌ లీడ్ చేసిన ఈ మూవీ మంగళవారం టైటిల్‌ పెట్టడంతో అంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇలాంటి టైటిల్‌ ఎవరైనా పెడతారా అనుకున్నారు. కానీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. రీసెంట్‌ గా టెలివిజన్ ప్రీమియర్ అయ్యింది. సాధారణంగా పెద్ద హీరోల బ్లాక్‌బస్టర్‌ మూవీస్‌ కి వచ్చే రేటింగ్‌కి ధీటుగా మంగళవారం టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది. 8.3 టీఆర్పీ రేటింగ్‌తో మంగళవారం టెలివిజన్‌లోనూ సూపర్‌హిట్ అయ్యింది.

Related Posts