ఓం భూమ్‌ బుష్.. హాలీవుడ్‌లో రిలీజ్ చేయాలనుకున్నాం : శ్రీవిష్ణు

ఈ సినిమా ఇంగ్లీష్‌లో తీసి హాలీవుడ్‌లో రిలీజ్‌ చేద్దామనుకున్నాం.. ఎక్కడ తీసినా కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది.. ఈ మాటలు చెప్పింది శ్రీ విష్ణు.. చెప్పింది ఓం భూమ్‌ బుష్ సినిమా గురించి. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి.. ఈ ముగ్గురు మెయిన్ లీడ్‌ గా హుషారు ఫేమ్‌ శ్రీ హర్ష కొనగంటి డైరెక్ట్‌ చేసిన ఈ మూవీని V సెల్యులాయిడ్‌, సునీల్‌ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువి క్రియేషన్స్‌ సహకారం అందిస్తోంది. ఈ సినిమా టీజర్‌ లాంచ్ ఈవెంట్ చాలా డిఫరెంట్ గా జరిగింది.
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు ఆస్ట్రోనాట్‌ స్పేస్‌ సూట్‌లో కనిపిస్తారు. టీజర్‌ ఆసాంత ఇదే డ్రస్‌లో కనిపించారు. ఆద్యంతం నవ్వులు పూయించింది టీజర్‌. గుప్త నిధిని వెతికే క్రమంలో బ్లాక్‌మ్యాజిక్‌ లాంటి అంశాలను కూడా హిలేరియస్ కామెడీ పండించేలా తీర్చిదిద్దారు.
ఓవైపు హర్రర్, మరోవైపు థ్రిల్లర్‌ అంశాలను పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా మలిచిన తీరు అద్భుతం. అందుకు దర్శకుడు శ్రీహర్షకు మంచి మార్కులు పడ్డాయి. ఇక నటీనటులు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణలు కామెడీ టైమింగ్‌లో తిరుగులేనివారు. ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా అని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఈ సినిమా యూనిక్ సబ్జెక్ట్ ఇంగ్లీష్‌లో తీసి హాలీవుడ్‌లో రిలీజ్ చేద్దామనుకున్నామనీ. ఏ భాషలో తీసినా సినిమా సూపర్‌ హిట్ అవుతుందన్నారు శ్రీ విష్ణు.
దర్శకుడు శ్రీ హర్ష ఏడాదిన్నరపాటు టార్చర్ పెట్టాడన్నారు నవ్వుతూ రాహుల్ రామకృష్ణ. మా కష్టానికి ఫలితం మీరే ఇవ్వాలంటూ ఆడియెన్స్‌ని కోరారు.
టీజర్‌ నచ్చినందుకు థ్యాంక్స్‌ చెప్పారు ప్రియదర్శి.. మార్చి 22 న ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు ప్రియదర్శి.
ఓం భూమ్‌ బుష్ టైటిల్‌ లాగే డిఫరెంట్ గా ఉంటూ ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. మార్చి 22 న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు.

Related Posts