పవన్ కళ్యాణ్‌ గారు ఆపరేషన్‌ వాలెంటైన్ టీజర్ ఐదు సార్లు చూసారు : వరుణ్‌తేజ్‌

పుల్వామా దాడికి ప్రతీకారంగా మన ఎయిర్‌ఫోర్స్‌ ఆర్మీ వీరత్వం బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న మూవీ ఆపరేషన్‌ వాలెంటైన్. శక్తిప్రతాప్‌సింగ్‌ హడా డైరెక్షన్‌లో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. వరుణ్‌ తేజ్‌, మానుషి చిల్లర్‌ జంటగా రాబోతున్న ఈ మూవీ మార్చి 1 న తెలుగు హిందీ భాషల్లో రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా హీరో వరుణ్‌ తేజ్ పాత్రికేయులతో ముచ్చటించారు.


2020లో డైరెక్టర్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ ఈ సినిమా కథ చెప్పడంతో నచ్చి ఓకే చెప్పానన్నారు వరుణ్‌ తేజ్‌. అంతకు ముందు తీసిన సర్జికల్ స్ట్రైక్స్‌ షార్ట్ ఫిల్మ్‌ వైరల్ అయ్యింది.. ఆ మూవీ చూసి ఆర్మీ అధికారులే ఆశ్చర్యపోయి ఈ సినిమాకి సహకరించారన్నారు. ఈ కథని చాలా పాషన్ తో చేశాడు. తనకి వీఎఫ్ఎక్స్ పై కూడా చాలా మంచి పట్టు వుంది. నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్ ని చాలా అద్భుతంగా రాబట్టుకునే నేర్పు తనలో వుందన్నారు.
వాస్తవానికి సోనీ పిక్చర్స్‌ తో ఓ సినిమా చేయాల్సి ఉంది.. కానీ .. అది టేకాఫ్ కాలేదు. అయితే ఈ కథ వచ్చినపుడు వారికి చెప్తే.. వారికీ నచ్చింది.. దాంతో ఆపరేషన్‌ వాలెంటైన్‌ సిద్దమయిందన్నారు.


2019 లో పుల్వామా దాడి ఘటనలో అమరులైన జవాన్లకు ఘననివాళి అర్పిస్తూ… ఎయిర్‌ ఫోర్స్ విభాగం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. అందుకే ఈ సినిమాకు ఆపరేషన్‌ వాలెంటైన్‌ అని పేరు పెట్టామన్నారు. అంటే ఇది దేశానికి సంబంధించిన ప్రేమ అన్నారు వరుణ్ తేజ్‌.


అంతరిక్షం టైమ్‌లో గ్రీన్‌ స్క్రీన్‌ చూయించి ఇక్కడ చంద్రుడు ఉన్నాడని చెప్తే నటించడానికి కాస్త ఇబ్బందనిపించింది. కానీ ఈ సినిమాకు ముందే ఫైటర్ జెట్‌ ఎలా పనిచేస్తుంది. . ఎంత స్పీడ్‌లో వెళ్తుందనేది ముందే తెలుసుకుని నటించానన్నారు. ఇలాంటి పాత్రలు చేయడం ఒక ఛాలెంజ్. ముఖం మొత్తం ఆక్సిజన్ మాస్క్ తో కప్పబడి వుంటుంది. ఎమోషన్ ని కళ్ళతోనే పలికించాలి. ఇందులో రుద్ర పాత్రలో కనిపిస్తాను. కొందరు రియల్ ఎయిర్ ఫైటర్స్ స్ఫూర్తితో నా పాత్రని దర్శకుడు చాలా అద్భుతంగా డిజైన్ చేశాడన్నారు.
మానుషి చిల్లర్ మిస్‌వరల్డ్ విన్నర్ గా దేశని పేరు తీసుకొచ్చారు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసిందన్నారు.


టీజర్ రిలీజ్ అయిన తర్వాత బాబాయ్ ని కలవడం జరిగింది. ఆయన సినిమాల గురించి పెద్దగా మాట్లాడరు. బావుంది, గుడ్.. ఇంతవరకే వుంటుంది ఆయన రియాక్షన్. అలాంటి ఆయన ‘ఆపరేషన్ వాలెంటైన్’ టీజర్ ని ఐదారుసార్లు చూశాను. చాలా బావుంది. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా చాలా బాగా కనిపిస్తున్నావ్. సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాను’ అని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ఇలా చెప్పడం చాలా అరుదు. ఇలాంటి సినిమాలు బాబాయ్ కి చాలా ఇష్టమన్నారు వరుణ్ తేజ్.
రాబోయే మట్కా సినిమా కమర్షియల్‌ గా బాగా వర్కవుటవుతుందన్నారు.

Related Posts