Tag: Superstar Krishna

విలక్షణ శైలి ఉన్న దర్శకుడు సాగర్

తెలుగు సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు సీనియర్స్‌ అంతా కన్నుమూస్తున్నారు. తాజాగా సీనియర్ డైరెక్టర్ సాగర్ కన్నుమూయడంతో పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆయన వయసు 70యేళ్లు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన…

నాన్నగారు నాకు చాలా ఇచ్చారు.. అందులో గొప్పది మీ అభిమానం:  సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్‌స్టార్‌ కృష్ణ గారి పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు మాట్లాడుతూ..‘నాన్న గారు నాకు చాలా ఇచ్చారు. నాన్న గారు ఇచ్చిన దాంట్లో అన్నిటికంటే గొప్పది…

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ప్రీరిలీజ్ ఈవెంట్

వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.  ఆనంది కథానాయిక. ఈ నెల 25న సినిమా థియేటర్లలో  విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గానిర్వహించారు. హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. దర్శకులు  ఇంద్రగంటి మోహన్ కృష్ణ, తిరుమల కిషోర్, విఐ ఆనంద్, విజయ్ కనకమేడల, వశిష్ట, రామ్ అబ్బరాజు, నిర్మాతలు సతీష్ వర్మ, అభిషేక్ అగర్వాల్ అతిధులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో సూపర్ స్టార్ కృష్ణ గారికి చిత్ర యూనిట్ నివాళులు అర్పించింది. హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చిన అతిథులు అందరికీ కృతజ్ఞతలు. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మా కడలి గారు అద్భుతమైన ఆర్ట్ వర్క్ చేశారు. ప్రతి ఫ్రేము రిచ్ గా వుంటుంది. డీవోపీ రాం రెడ్డిగారు సినిమాని అద్భుతంగా చూపించారు. ఇందులో నేను చాలా అందంగా వున్నాని చెబుతున్నారు.  నన్ను అంత అందంగా చూపించిన డీవోపీ రాం రెడ్డి గారి కిథాంక్స్. ఎడిటర్ చోటా ప్రసాద్ గారు ఆల్ రౌండర్ గా పని చేశారు. శ్రీచరణ్ చాలా హార్డ్ వర్కింగ్ కంపోజర్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఒక డ్యాన్స్ నెంబర్ కూడా వుంది. మాటల రచయిత అబ్బూరి రవి నాంది సినిమా నుండి పరిచయం. ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఇందులో ఒక పాట కూడా పాడారు. ప్రసాద్ గారికి హ్యాపీ బర్త్ డే. ఆయనకి గిఫ్ట్ 25న ఇస్తాం. ఈ సినిమాతో పరిచయం అవుతున్న నిర్మాత రాజేష్ దండా, దర్శకుడు మోహన్ .. ఇద్దరికీ కంగ్రాట్స్. రాజేష్ కి మినీ దిల్ రాజు అని పేరు పెట్టాం. మొదటి సినిమా విడుదల కాకముందే మరో రెండు సినిమాలు స్టార్ట్ చేశారు. దిల్ రాజు గారిలానే పెద్ద నిర్మాత కావాలి. మోహన్ గారు చాలా ప్రతిభ వున్న దర్శకుడు. కథ సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశాం. అందరం ఒక టీం వర్క్ గా ఈ సినిమా చేశాం. అనంది గారు ఈ సినిమా చేస్తున్నపుడు బేబీకి బర్త్ ఇచ్చి మూడో నెల. ఆమె చాలా కష్టపడతూ ఏ రోజు కష్టాన్ని బయటికి చెప్పాకుండా చేశారు. ఆనంది అద్భుతమైన నటి. ఆమెతో పని చేయడం చాలా అనందంగా వుంది. వెన్నెల కిషోర్, ప్రవీణ్ .. ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ఇది సీరియస్ సినిమా అని చాలా మంది అనుకుంటారు. కాదు. ఇందులో 40 శాతం కామెడీ వుంటుంది. 60 శాతం ఎమోషన్ వుంటుంది. సినిమా అద్భుతంగా వచ్చింది.  నా కెరీర్ నాంది లాంటి విభిన్నమైన సినిమా ఇచ్చిన నిర్మాత సతీష్ గారికి, దర్శకుడు విజయ్ కి థాంక్స్. మాకు ఎల్లవేళలా తోడుండే వంశీ- శేఖర్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్. వారి సపోర్ట్ మర్చిపోలేనిది. మాకు, మా టీంకి వారి సపోర్ట్ ఎప్పుడూ ఇలానే వుండాలి. ఇందులో నేను టీచర్ గా కనిపిస్తా. ఈ సందర్భంగా నేను స్టూడెంట్ గా వున్నపుడు  కొన్ని యాక్టింగ్ క్లాసులు చెప్పిన సుమ గారికి కూడా కృతజ్ఞతలు. జీ స్టూడియోస్ తో కలిసి పని చేయడం అనందంగా వుంది. అన్ని బాషలలో ఆకట్టుకునే సత్తా వున్న సినిమా ఇది. ఇక్కడ విజయం సాధించిన తర్వాత మోహన్ దర్శకత్వంలోనే హిందీలో కూడా ఈ సినిమా చేయాలి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మీరంతా థియేటర్లో చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి’ అని కోరారు. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ… అల్లరి నరేష్ గారి సినిమాలు నాకు చాలా ఇష్టం. అల్లరి నుండి ఫాలో అవుతున్నా. ఆయన ఫన్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తా. గమ్యం, శంభో శివ శంభో లో ఆయన డిఫరెంట్ గా చేస్తే ఇంకా నచ్చేది. నరేష్ మొదటి నుండి అన్ని రకాల పాత్రలు చేసుకుంటూ వచ్చారు. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ పెద్ద సక్సెస్ అవ్వాలి. మరిన్ని గొప్ప పాత్రలు చేయాలి. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ గురించి నిర్మాత రాజేష్ గారు చెప్పారు. చాలా కంటెంట్ వున్న సినిమా అనిపించింది. రాజేష్ గారికి, ప్రసాద్ గారికి కథలు ఎంచుకోవడంలో మంచి టేస్ట్ వుంది. మారేడుమిల్లి అంటే నాకు చాలా ఇష్టం.’ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ పేరు పెట్టి అక్కడే సినిమా తీసిన దర్శకుడు మోహన్ గారికి కృతజ్ఞతలు. ఆనంది గారు చాలా సహజంగా నటిస్తారు. . ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మంచి పాజిటివ్ టీం. 25 తేదిన అందరూ థియేటర్ కి వచ్చి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాని దీవిస్తారని కోరుకుంటున్నాను. ఆనంది మాట్లాడుతూ.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ నా లైఫ్ లో చాలా స్పెషల్ మూవీ. మూడు నెలల బేబీతో ఈ సినిమా చేశా.  టీం ఇచ్చిన సపోర్ట్ ని ఎప్పుడూ మర్చిపోలేను.  నాపై ఎంతో నమ్మకంతో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. నాంది తర్వాత నరేష్ గారి తో పని చేయడం చాలా ఆనందంగా వుంది. నరేష్ గారు అద్భుతమైన యాక్టర్. ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాని నిర్మించిన రాజేష్ గారికి స్పెషల్ థాంక్స్. టీం అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు” తెలిపారు. చిత్ర దర్శకుడు ఏఆర్ మోహన్ మాట్లాడుతూ.. ఇది నా 17 ఏళ్ల కల. ఈ కలని నిజం చేసిన అల్లరి నరేష్ గారిని ఎప్పుడూ మర్చిపోలేను. నా లైఫ్ లాంగ్ నరేష్ గారికి థాంక్స్ చెబుతూనే వుంటాను. ప్రజల జీవితాన్ని తెరపై చెప్పాలనే కోరికే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ కథ. నిర్మాతలు రాజేష్ గారికి కృతజ్ఞతలు. వెన్నెల కిషోర్, ప్రవీణ్, రఘు బాబు.. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ కృతజ్ఞతలు. ఆనంది గారు చాలా అద్భుతంగా చేశారు. ఆర్ట్ డైరెక్టర్ కడలి, శ్రీ చరణ్, ఎడిటర్ ప్రసాద్, పృథ్వీ మాస్టర్, శేఖర్ మాస్టర్, డీవోపీ రాంరెడ్డి, మాటల రచయిత అబ్బూరి రవి గారికి కృతజ్ఞతలు” తెలిపారు. చిత్ర నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఈ నెల 25న సినిమా థియేటర్లలో  విడుదలౌతుంది. అందరూ థియేటర్లో చూసి నా మొదటి ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారికి అంకితంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నాం” అన్నారు. నాంది సతీష్ వర్మ మాట్లాడుతూ.. నాంది సినిమా వలనే నన్ను ఇక్కడికి పిలిచారు. దీనికి కారణం నరేష్ గారు. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మంచి సినిమాని నమ్ముతున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్” తెలిపారు. అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. నిర్మాత రాజా నా బ్రదర్ లాంటి వారు. చాలా సినిమాలని పంపిణీ చేసారు. ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. నరేష్ గారితో పాటు ఈ సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు. శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ..  ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ కొత్త అనుభూతిని ఇచ్చింది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాకి మ్యూజిక్ చేశాను. ఏఆర్ మోహన్ బ్రిలియంట్ దర్శకుడు. నరేష్ గారు అద్భుతమైన యాక్టర్. ఇందులో అబ్బూరి రవి గారు ఒక పాట పాడారు. నా మ్యూజిక్ టీం అందరికీ థాంక్స్. సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది” అన్నారు. తిరుమల కిషోర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు పరిచయమైన మొదటి హీరో అల్లరి నరేష్ గారు. ఆయనతో సినిమాల గురించి మాట్లాడుతుంటే సమయం తెలిసేది కాదు. నేను ముందుకు వెళ్ళడానికి ధైర్యం ఇచ్చింది నరేష్ గారు. కథ హీరో అని నమ్మే హీరో నరేష్ గారు. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలి” అని కోరారు. వశిష్ట మాట్లాడుతూ..  నరేష్ గారు 2021 నాందితో పెద్ద బ్లాక్ బస్టర్  కొట్టారు. ఇప్పుడు  ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ తో మరో బ్లాక్ బస్టర్ కొట్టాలి. మారేడుమిల్లి ప్రజానీకం టీం అందరికీ ఆల్ ది బెస్ట్” తెలిపారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అని అచ్చమైన తెలుగు టైటిల్ పెట్టారు. ఇది చాలా నచ్చింది. కొత్త తరహా కథ ఇది. సమాజానికి అవసరమైన కథ. ఇలాంటి యూనిక్ కథని నిర్మించిన రాజేష్ గారికి కృతజ్ఞతలు. కొత్త కథలు ఎంచుకుంటన్న నరేష్ గారు ‘నాంది’ నరేష్ గా మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్” తెలిపారు. విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. నిర్మాత రాజేష్ కి సినిమా అంటే చాలా ప్యాషన్. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ జెన్యూన్ స్క్రిప్ట్. నాంది లానే ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. అబ్బూరి రవి గారు అద్భుతమైన మాటలు రాశారు. ఒక పాట రాసి పాడారూ కూడా. నేను ఈ రోజు ఇక్కడ ఉండటానికి కారణం నరేష్ గారు. ఇలానే మంచి కథలు ఎంచుకుంటూ కొత్త దర్శకులని సపోర్ట్ చేస్తూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. విఐ ఆనంద్ మాట్లాడుతూ.. నిర్మాత రాజేష్ గారు ఎక్కడా రాజీ పడకుండా యునిక్ కంటెంట్ తో  ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ని ప్రజంట్ చేశారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. మోహన్ గారు సెన్సిబుల్ డైరెక్టర్. నరేష్ గారంటే నాకు చాలా ఇష్టం. సహజంగా నటిస్తారు. నాంది సినిమా నా రీసెంట్ ఫేవరెట్…

న భూతో అన్న రేంజ్ లో సూపర్ స్టార్ కృష్ణ స్మృతివనం

సూపర్ స్టార్ కృష్ణ అకాల మరణం ఫ్యాన్స్ ను పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. వయోభారంతో ఉన్నట్టు కనిపించినా.. మరీ ఇంత మరణించేంత అనారోగ్యంతో ఉన్నారన్న విషయం ఆయన పోయేంత వరకూ ఎవరికీ తెలియదు. అయితే కృష్ణ మరణం తర్వాత జరిగిన…

యశోదకే దిక్కులేదు..ఇంక రెండు, మూడు కూడానా..?

కంటెంట్ సినిమాలకే కలెక్షన్స్ అనే మాట కూడ రిపేర్ కు వస్తోందిప్పుడు. ప్రేక్షకులు వైవిధ్యమైన సినిమాలను ఇష్టపడుతున్నారు. కానీ బలమైన ప్రమోషన్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పెడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. రీసెంట్ గా వచ్చిన సమంత…

సూపర్‌స్టార్ కృష్ణకు అస్వస్థత

సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజుల క్రితమే ఆయన మొదటి భార్య ఇందిరా దేవి గారు కన్నుమూశారు. అప్పటి నుంచి ఒంటరితనం తో బాధపడుతున్నారాయన. మరో వైపు వయోభారం కూడా కారణం కావడం తో అనారోగ్యం పాలయ్యారు.…

సూపర్ స్టార్ కృష్ణ, హీరో మహేష్ బాబు లను పరామర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

సీనియర్ సినీనటులు, సూపర్ స్టార్ కృష్ణ, హీరో మహేష్ బాబు లను పరామర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం మహేష్ బాబు మాతృమూర్తి మరణించగా ఫిల్మ్ నగర్ లోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి సంతాపాన్ని తెలిసిన మంత్రి ఇందిరాదేవి…

హరనాథ్ జీవిత చరిత్ర ‘అందాల నటుడు’ పుస్తకం విడుదల

సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదలైన అలనాటి అందాల నటుడు హరనాథ్ జీవిత చరిత్ర ‘అందాల నటుడు’బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు హీరో బుద్ధరాజు హరనాథ్ రాజు 1936లో…

ఈ సారి సమ్మోహనపరుస్తారా ..?

బ్యాక్ గ్రౌండ్ ఉంది. కానీ వారసత్వంగా వచ్చాడు అని చెప్పలేం. ఎందుకంటే ఆ బ్యాక్ గ్రౌండ్ ను వాడుకుని అతను ఎదగడం లేదు. తనదైన టాలెంట్ తోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్లేస్ సంపాదించుకుంటున్నాడు. చిన్న సినిమాలతో మొదలైనా.. మీడియం…