‘రామం రాఘవం‘ టీజర్.. కొత్త పంథాలో తండ్రీకొడుకుల అనుబంధం

కమెయడిన్ ధనరాజ్ డైరెక్టర్ గానూ సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. ధనరాజ్ దర్శకత్వం వహిస్తూ నటిస్తోన్న చిత్రం ‘రామం రాఘవం’. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో కొడుకుగా ధనరాజ్ నటిస్తుంటే.. తండ్రి పాత్రలో మరో విలక్షణ నటుడు సముద్రఖని కనిపించబోతున్నాడు. పృథ్వి పొలవరపు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ ద్విభాష చిత్రానికి ‘విమానం’ దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను సమకూరుస్తుండడం విశేషం. ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ‘రామం రాఘవం‘ టీజర్ రిలీజయ్యింది. ‘నేను ఇంటి పేరు మాత్రమే ఇవ్వగలను.. మంచి పేరు వాడే తెచ్చుకోవాలి‘ అన్న దృక్పథంతో ఉండే తండ్రి పాత్రలో సముద్రఖని కనిపిస్తున్న ఈ మూవీలో కొడుకుగా ధనరాజ్ జులాయి తరహా పాత్రలో దర్శనమివ్వబోతున్నాడు. కన్న కొడుకుకు మంచి సంబంధం వచ్చినా.. వద్దు అని చెప్పే తండ్రిగా సముద్రఖని పాత్రను వైవిధ్యంగా చూపించాడు డైరెక్టర్ ధనరాజ్. ఓవరాల్ గా తండ్రీ కొడుకుల అనుబంధాన్ని కొత్త పంథాలో ఆవిష్కరించే ప్రయత్నమే ‘రామం రాఘవం‘. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts