శంకర్ పై విసిగిన రామ్ చరణ్‌ కొత్త ప్రయాణం

రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో సినిమాఅనౌన్స్ అయినప్పుడు అభిమానులు ఎంత ఆనందించారో ఇప్పుడు అంత బాధపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన ఆచార్య రాజమౌళి సెంటిమెంట్ లో పోయినా.. శంకర్ సినిమాతో మళ్లీ దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంటాడు అనుకున్నారు. బట్ శంకర్ ఈ గేమ్ ఛేంజర్ ను వదిలి.. భారతీయుడు-2 పూర్తి చేయడానికి వెళ్లాడు. అలా వెళ్లిన వాడు యేడాదవుతున్నా ఇప్పటి వరకూ రాలేదు. అటు భారతీయుడు2 కూడా పూర్తి కావడం లేదు. దీంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ క్రాస్ రోడ్స్ లో పడిపోయింది. మధ్యలో ఒకటీ అరా షెడ్యూల్స్ జరిగినా ఇప్పటి వరకూ సినిమా 30శాతం చిత్రీకరణ కూడా పూర్తి చేసుకోలేదు.


గేమ్ ఛేంజర్ తర్వాత చేయాలని బుచ్చిబాబుతో సినిమాకు ఓకే చెప్పాడు. బుచ్చిబాబు రెడీగానే ఉన్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకున్నాడు. రీసెంట్ గా ఆఫీస్ కూడా తీశారు. కాకపోతే ఈ మూవీ పట్టాలెక్కడానికి ఇంకా కొంత టైమ్ ఉంది. మరి ఈ గ్యాప్ లో ఏం చేయాలి.. అటు చూస్తే శంకర్ ఎప్పుడు వస్తాడో కూడా చెప్పడం లేదు. ఇటు దిల్ రాజు తాపీగా తన సినిమాలు తను చేసుకుంటున్నాడు. దీంతో రామ్ చరణ్‌ తాజాగా వెకేషన్ కు వెళ్లిపోయాడు.తమ కూతురుతో కలిసి ఫస్ట్ వెకేషన్ కు వెళ్లారు చరణ్‌ దంపతులు.

ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి ముందుగా వీరు ప్యారిస్ వెళుతున్నారు. అక్కడి నుంచి ఇండియాకు వస్తారా లేక ఇంకా వేర్వేరు దేశాలకూ వెళతారా అనేది చూడాలి. ఏదేమైనా కూతురు పుట్టినప్పుడే నెలకు పైగా హాలిడేస్ తీసుకున్నాడు చరణ్‌. ఆ తర్వాతైనా శంకర్ వస్తాడనుకుంటే రావడం లేదు. అందుకే ఈ టైమ్ ను కుటుంబంతో గడిపేందుకు వెళ్లిపోయాడు.

Related Posts