అందరి కళ్లూ శెట్టి’స్ పైనే

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఈ మధ్య కాలంలో పూర్తి పాజిటివ్ తెచ్చుకున్న సినిమాల్లో ఇదీ ఒకటి. కాంబినేషన్ క్రేజ్ తో పాటు కంటెంట్ కూడా ఫ్రెష్ గాఉన్నట్టుగా ట్రైలర్ చూస్తే అర్థమైంది. ముఖ్యంగా డిఫరెంట్ స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకుంటూ యూనిక్ గా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాడు నవీన్ పోలిశెట్టి. లేట్ గా హీరో అయినా.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలుతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టీ హిట్ అయితే హ్యాట్రిక్ పూర్తవుతుంది. నవీన్ తో నటించేందుకు అనుష్క శెట్టి ఒప్పుకుందీ అంటేనే ఈ కథలో ఎంత స్టఫ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, ప్రొఫెషన్స్, డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుడుతుందా.. పుడితే ఆ ప్రేమకథ విజయం సాధిస్తుందా అనే పాయింట్ కనిపిస్తోందీ సినిమాలో. అనుష్క చెఫ్‌ గా, నవీన్ స్టాండప్ కమెడియన్ గా నటించారని ముందే చెప్పారు. ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ హిలేరియస్ గా ఉండబోతున్నాయని ట్రైలర్ కే అర్థమైంది. అలాగే పెళ్లితో పనిలేకుండానే తల్లి కావాలనుకున్న(ఐవిఎఫ్ పద్దతి కావొచ్చు) ఓ బోల్డ్ లేడీ పాత్రలో నటించేందుకు అనుష్క ఒప్పుకోవడం ఆశ్చర్యమేం కాదు. తనకు ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ అంటే ఇష్టమే కదా. కాకపోతే ఆ నిర్ణయం మార్చుకుని.. తనకంటే వయసులో చిన్నవాడైన మిస్టర్ శెట్టితో ప్రేమలో పడుతుందా అనే కాన్ ఫ్లిక్ట్ ఈ సినిమాకు ప్రధానం కానుంది. ఆ సంఘర్షణ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే ఖచ్చితంగా కాసులు కురుస్తాయి.

అయితే వీళ్లు మరీ హెవీ డ్రామా లేకుండా లైటర్ వే లోనే అన్ని కాన్ ఫ్లిక్ట్స్ ను చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఈ తరం ఆడియన్స్ కు మరీ డోస్ ఎక్కువైనా.. కష్టమే. కాబట్టి వీరి నిర్ణయం కూడా మంచిదే. మొత్తంగా ఇప్పుడు జవాన్ పై అతి భారీ అంచనాలున్నా.. అదే టైమ్ లో తెలుగువాళ్లంతా మిస్ శెట్టి మిస్టర్ శెట్టి కోసమే చూస్తున్నారు. మరి వారి ఎదురుచూపులు ఫలించేలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారా లేదా అనేది చూడాలి.

Related Posts