క్రిష్ విషయంలో ఇది రెండోసారి జరిగింది

ప్రస్తుతం తెలుగులో ఉన్న విలక్షణ దర్శకుల్లో క్రిష్ ఒకరు. తొలి సినిమా ‘గమ్యం‘ నుంచి తనకంటూ ప్రత్యేక పంథాను ఏర్పరచుకుని వైవిధ్యభరిత కథాంశాలతో సినిమాలు చేస్తున్నాడు క్రిష్. షార్ట్ పీరియడ్ లోనే తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసిన క్రెడిట్ కూడా క్రిష్ సొంతం.

ఎంత కష్టపడుతున్నా.. కొన్ని అనివార్య కారణాల వలన డైరెక్టర్ క్రిష్ కి కొన్ని కష్టాలు తప్పడం లేదు. గతంలో కంగన రనౌత్ ‘మణికర్ణిక‘ సినిమాని ఎంతో కష్టపడి మొదలుపెట్టాడు క్రిష్. ఆ సినిమాకి దాదాపు 70 శాతం షూటింగ్ అతనే పూర్తిచేశాడు. అదే సమయంలో ‘ఎన్.టి.ఆర్‘ బయోపిక్ ను ఒప్పుకున్న క్రిష్.. ‘మణికర్ణిక‘ నుంచి తప్పుకోక తప్పలేదు. దీంతో.. ‘మణికర్ణిక‘ చిత్రానికి క్రిష్ తో పాటు కంగన రనౌత్ పేరు కూడా దర్శకుల లిస్టులో చేరింది.

ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు‘ విషయంలోనూ అదే జరుగుతోంది. ‘మణికర్ణిక‘ చిత్రానికి రచయిత విజయేంద్రప్రసాద్. కానీ.. ‘హరి హర వీరమల్లు‘ కథ విషయంలోనూ క్రిష్ ఎక్కువ కసరత్తులు చేశాడు. ఈ సినిమాని చాలాభాగం కంప్లీట్ చేశాడు. అయితే.. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీగా ఉండడంతో ‘హరి హర వీరమల్లు‘ ముందుకు కదలడం లేదు. ఈ నేపథ్యంలో.. అనుష్క తో ‘ఘాటి‘ అనే కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు క్రిష్. దీంతో.. ఇప్పుడు ‘హరి హర వీరమల్లు‘ బాధ్యతను నిర్మాత ఎ.ఎమ్.రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీసుకున్నాడు. ఆ విధంగా క్రిష్, జ్యోతికృష్ణ ‘హరి హర వీరమల్లు‘కి దర్శకులుగా మారారు.

Related Posts