ఓ.జి మెంటల్ మాస్ టీజర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి టీజర్ వచ్చేసింది. ఇవాళ ఆయన బర్త్ డే సందర్భంగా టీజర్ వస్తుంది అని చెప్పినట్టుగానే చెప్పిన టైమ్ కు ఓజి టీజర్ వచ్చేసింది. ఊహించినదానికంటే కాస్త మాసివ్ గానే ఉందీ టీజర్. ఒక రకంగా ఫ్యాన్స్ కు ఇది పూనకాలు తెప్పిస్తుంది. పవన్ కళ్యాణ్ ను వాళ్లు ఇలాంటి పాత్రల్లోనే చూడాలనుకుంటున్నారు. కొడితే బాక్సాఫీస్ కుంభస్థలం బద్ధలైపోయే కంటెంట్ లాంటి సినిమాలను కోరుకుంటున్నారు. అది ఇదే అనిపించేలా దర్శకుడు సుజిత్ రూపొందిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.


నిజానికి బర్త్ డే టీజర్స్ అంటే ఏదో అలా కానిచ్చేస్తారు. బట్ సుజిత్ అలా చేయలేదు. పవన్ కళ్యాణ్ ను ఫైర్ స్ట్రామ్ లా చూపించాడు. అతని ఎంట్రీ నుంచి యాక్షన్ వరకూ నెక్ట్స్ లెవల్ అన్నట్టుగా చూపించాడు. ముఖ్యంగా బేస్ వాయిస్ ఆర్టిస్ట్ అర్జున్ దాస్ తో చెప్పించిన వాయిస్ ఓవర్ లోనే ఓ పవర్ ఉంది.. ” పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా.. అది మట్టి చెట్లతో పాటు సగం ఊరిని ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాన్ కడగలేకపోయింది. ఇట్ వాజ్ ద ఫ్రీకింగ్ బ్లడ్ బాత్.. అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే.. ” అంటూ అతని వాయిస్ లోని బేస్ కంటే తమన్ ఆర్ఆర్ ఎక్కువగా భయపెట్టింది. ఈ డైలాగ్ ను బట్టి ఆ గ్యాంగ్ స్టర్ ఎంత డేంజర్ అనేది అర్థం అవుతుంది.
ఇక వాయిస్ లో బాంబే అని చెప్పడం.. వారి కాస్ట్యూమ్స్ చూస్తుంటే ఇది పీరీయాడిక్ మూవీగా కనిపిస్తోంది. మొత్తంగా కొన్నాళ్ల నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నా.. అవి ఫ్యాన్స్ కు పూర్తి స్థాయిలో సంతృప్తిని ఇచ్చే సినిమాలు కాదు. బట్ ఈ మూవీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకేసారి పడితే ఇక రికార్డులు అల్లాడిపోవడం ఖాయం.


ఇక ఏ మాటకు ఆ మాట.. ఈ టీజర్ లో థమన్ ఆర్ఆర్ అద్భుతం అంటే కూడా తక్కువే అవుతుంది. ఇప్పటి వరకూ ఏ తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ తోపు అనుకుంటున్నారో.. వాళ్లను మించి ఎలివేషన్స్ ఇవ్వబోతున్నాడు అని అర్థం అవుతోంది. జైలర్ కు అనిరుధ్ లాగా ఈ మూవీకి థమన్ అలా ఎసెట్ అవుతాడనుకోవడంలో ఏ సందేహం అక్కర్లేదు అని ఈ టీజరే ప్రూవ్ చేసింది. మొత్తంగా ఫ్యాన్స్ కు సుజిత్ అద్దరిపోయే బర్త్ డే ట్రీట్ఇచ్చాడనే అనుకోవాలి.

Related Posts