తెలుగు టాప్ స్టార్ హీరోతో అట్లీ

తమిళ్ టాప్ డైరెక్టర్ అట్లీ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చాలా తక్కువ టైమ్ లోనే టాప్ కమర్షియల్ డైరెక్టర్ గా ఎదిగాడు అట్లీ. ఆ కమర్షియల్ ఎలివేషన్సే అతన్ని ఏకంగా షారుఖ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాయి. ఈ ఇద్దరి కాంబోలో రూపొందిన జవాన్ సినిమా ఈ నెల 7న విడుదల కాబోతోంది. ఇప్పటికే వచ్చిన రెండు ట్రైలర్స్ చూస్తే ఈ మూవీ ఓపెనింగ్స్ తో సరికొత్త రికార్డులు ఖాయం అంటోంది ట్రేడ్. కంప్లీట్ కమర్షియల్ఎలిమెంట్స్ తో ఓ మెసేజ్ ను మిక్స్ చేసినట్టుగా ట్రైలర్ కనిపిస్తోంది. ఇక ఈ మూవీ రిజల్ట్ ను బట్టి అతను తెలుగులో ఓ టాప్ హీరోతో సినిమా చేసే అవకాశాలున్నాయని టాలీవుడ్ టాక్.


నిజానికి అట్లీ తెలుగులో ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు అనే వార్తలు మూడు నాలుగేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకా చెబితే ఈ కాంబినేషన్ కోసం మైత్రీమూవీస్ వాళ్లు అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉన్నారు. మరెందుకో ఈ కాంబో సెట్ కావడం లేదు. బట్ లేటెస్ట్ గా వినిపించేది చూస్తే అంతకు మించి అనేలా ఉంది. యస్.. లేటెస్ట్ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ విన్నర్ ఐకన్ స్టార్ ను అట్లీ డైరెక్ట్ చేయబోతున్నాడు అనేదే లేటెస్ట్ సెన్సేషనల్ న్యూస్. రీసెంట్ గా అట్లీ బన్నీకి ఒక లైన్ చెప్పాడట. ఆ లైన్ అతనికి బాగా నచ్చిందని కూడా చెప్పాడట. అంచేత ఈ ఊహించని కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ వంద శాతం ఉందనేది టాలీవుడ్ టాక్.


ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ మూవీని 2024 మార్చి 22న విడుదల చేయబోతున్నారు. ఇక ఆల్రెడీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా అనౌన్స్ అయి ఉంది. ఈ మూవీ 2024 ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి నుంచి కరెక్ట్ గా కౌంట్ చేసుకున్నా 2025 సంక్రాంతికి విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

అంటే అట్లీతో మూవీ చేయాలంటే త్రివిక్రమ్ మూవీలో ఎలాంటి గెటప్స్ ఉండకూడదు. అలాగే అట్లీ మూవీలోనూ గెటప్ కు సంబంధించి పెద్ద మార్పులు కనిపించకూడదు. అప్పుడే సెట్ అవుతుంది. మరి ఈ కాంబినేషన్ గురించి ఓ క్లారిటీ జవాన్ రిజల్ట్ తర్వాత వస్తుందనే మాటలూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా హీరోలను ఎలివేట్ చేయడంలో అట్లీ ఎక్స్ పర్ట్. అల్లు అర్జున్ లాంటి స్టార్ తో అంటే దాని రేంజ్ మారుతుందనే చెప్పాలి.

Related Posts