పిఠాపురంలో మెగా ప్రిన్స్ ప్రచారం

పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మెగా హంగామా కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ ని ఎమ్మేల్యేగా గెలిపించేందుకు మెగా టీమ్ అంతా పిఠాపురంలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే జబర్దస్త్ టీమ్ హైపర్ ఆది, గెటప్ శ్రీను, రాం ప్రసాద్ వంటి వారు అక్కడ ఓ రేంజులో ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ సందర్భంగా ఎస్.కె.ఎన్, సాయిరాజేష్ వంటి వారు కూడా పిఠాపురంలో కనిపించారు. ఇంకా.. జానీ మాస్టర్, ‘గబ్బర్ సింగ్’ గ్యాంగ్ కూడా పవన్ తరపున ప్రచారం చేస్తూ పిఠాపురంలో సందడి చేస్తున్నారు.

లేటెస్ట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పిఠాపురం బయలుదేరాడు. ఈరోజు (ఏప్రిల్ 27) పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నాడు వరుణ్ తేజ్. మరి.. వరుణ్ బాటలో ఇంకెంతమంది మెగా హీరోలు పిఠాపురంలో సందడి చేస్తారో చూడాలి.

Related Posts