అప్పుడే ఓటిటిలోకి జైలర్

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ జైలర్. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న సూపర్ స్టార్ కు ఈ మూవీ తిరుగులేని రికార్డులను ఇచ్చింది. నెల్సన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీకి ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.

ఈ విజయంలో సూపర్ స్టార్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ తో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లకూ భాగస్వామ్యం ఉంది. ఆ ఇద్దరి గెస్ట్ అప్పీరియన్స్ కు బెస్ట్ అప్లాజ్ వచ్చింది. వారి వల్లే కేరళ, కర్ణాటకలో రికార్డ్ స్థాయి వసూళ్లు వచ్చాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 650 కోట్లు కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ 700 కోట్ల మార్క్ వైపు దూసుకుపోతోంది. ఈ క్రమంలో సడెన్ గా ఆ కలెక్షన్స్ కు బ్రేక్ పడే న్యూస్ ఇచ్చింది ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్.


జైలర్ విడుదలై నెల రోజు కూడా కావడం లేదు. అప్పుడే ఓటిటిలో విడుదల కాబోతోంది. ఫ్యాన్స్ కు కొంత నిరాశ కలిగించే అంశమే అయినా.. ఈ మూవీ ఈ నెల 7 నుంచే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. విశేషం ఏంటంటే.. అదే రోజు అట్లీ డైరెక్ట్ చేసిన షారుఖ్ ఖాన్ మూవీ జవాన్ విడుదల కాబోతోంది.

ఈ మూవీ ప్రభావం జవాన్ పైడే అవకాశం లేకపోలేదు. ఇక ఓటిటిలో ఒకేసారి అన్ని భాషల్లోనూ స్ట్రీమ్ కాబోతోంది. మరి ఓటిటిలో ఈ చిత్రానికి ఎలాంటి అప్లాజ్ వస్తుందో కానీ సూపర్ స్టార్ మాత్రం కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.

Related Posts