‘విశ్వంభర’ డ్యాన్సుల్లో మెగా ఛేంజెస్

టాలీవుడ్ లో డ్యాన్సులకు కేరాఫ్ అడ్రస్ మెగాస్టార్ చిరంజీవి. అందుకే మెగాస్టార్ తో పనిచేయడానికి కొరియోగ్రాఫర్స్ క్యూ కడతారు. కానీ.. కొన్ని సినిమాలుగా చిరంజీవి తన పాటలకు శేఖర్ మాస్టర్ నే ఎక్కువ తీసుకుంటున్నాడు. ‘వాల్తేరు వీరయ్య‘ వంటి సినిమాలకైతే శేఖర్ సింగిల్ కార్డ్. మొత్తం పాటలన్నీ అతనే కంపోజ్ చేశాడు.

అయితే.. ఇప్పుడు ‘విశ్వంభర’ కోసం డ్యాన్సుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడట చిరంజీవి. పాటలన్నింటికీ ఒకే కొరియోగ్రాఫర్ అయితే మొనాటినీ వస్తుందని భావించిన మెగాస్టార్ ‘విశ్వంభర’లో ఒక్కో పాట కోసం ఒక్కో కొరియోగ్రాఫర్ ను రంగంలోకి దింపుతున్నాడట. ఈకోవలో ఇప్పటికే ఈ చిత్రం కోసం విజయ్ బిన్నీ, శోభి మాస్టర్లు పనిచేశారట. ఇంకా.. మిగతా పాటల కోసం మరికొంతమంది కొరియోగ్రాఫర్స్ పనిచేయనున్నారట.

చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150‘ విషయంలో అదే జరిగింది. ఈ సినిమాలో ఒక్కో పాటను ఒక్కో కొరియోగ్రాఫర్ విభిన్నంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ‘విశ్వంభర’ సినిమాకి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత చిరు-కీరవాణి కాంబోలో రూపొందుతోన్న సినిమా ఇది.

Related Posts