మా ఒదిన చేసిన తప్పు వల్లే ఇక్కడ ఉన్నాను – పవన్ కళ్యాణ్

బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇంత ప్రేమ,అభిమానం నాకు సినిమానే ఇచ్చిది. ఇంత ప్రేమ, అభిమానం కలా నిజమా అనిపిస్తుంది. ఇది నేను కోరుకున్న జీవితం కాదు. భగవంతుడు ఇచ్చిన జీవితం. ఏ రోజు కూడా చిన్న జీవితాన్ని బతకాలనుకున్నాను తప్ప.. నటుడవవ్వాలనీ, పాలిటిక్స్ లో ఉంటానని అనుకోలేదు. ఇలాంటి సందర్బాల్లో మీ పట్ల నాకున్న అభిమానం, ప్రేమను మాటలతో చెప్పలేను.సముద్రఖని గారు చెబుతున్నట్టుగా సమాజం నుంచి తీసుకోవడం కాదు.. సమాజానికి ఏమిచ్చాం అని ఆలోచించాలి. ఇది సంపూర్ణమైన సినిమా. ఈ సినిమా ప్రత్యేకమైన పరిస్థితులో వచ్చింది. కరోనా సమయంలో అటు పాలిటిక్స్ లో తిరగలేక.. ఏమీ చేయలేని పరిస్థితులో ఉన్నప్పుడు ప్రముఖ దర్శకులు, సన్నిహితులు, మిత్రులు త్రివిక్రమ్ గారు ఫోన్ చేశారు.

సముద్రఖని గారు ఓ కథ చెప్పారని నాకు టూకీగా చెప్పారు. సముద్రఖని గారు విషయం చెప్పారు. కథేంటీ అని అడిగాను. కానీ ఒకసారి కథ చెప్పిన తర్వాత నేను దేన్లోనూ ఇన్వాల్వ్ కాను. సముద్రఖని గారు రాసిన కథను త్రివిక్రమ్ గారు చాలా బాగా స్క్రీన్ ప్లే రాశారు. ఈ కథ విషయంలో సముద్రఖని గారికి నేను అభిమానిని అయ్యాను. మనలో చాలామందికి పూర్తిగా తెలుగు, ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడుతున్నాం. కనీసం పదివాక్యాలు ఇంగ్లీష్ లో మాట్లాడలేం.అలాంటిది సముద్రఖని గారు మన భాషకాక పోయినా.. మొదటి రోజు స్క్రిప్ట్ వినడానికి వెళితే ఆయన తెలుగులో చదువుతున్నారు. అది విని నేను కలగంటున్నా అనుకున్నా. అదే నేను అడిగాను.తెలుగు సినిమా కోసం తెలుగు నేర్చుకున్నారు. ఆయన తెలుగు నేర్చుకుని మాకు కనువిప్పు కలిగించారు. నేను కూడా తమిళం నేర్చుకుంటాను. మీరు మాకు కనువిప్పు కలిగించారు. ఎవరైనా గొప్ప కథకులు, స్క్రీన్ ప్లే రైటర్స్ ఆ భాషలోని గొప్పదనం, సాహిత్యం తెలుసుకోవడం వల్లే సాధ్యం అవుతుంది. సముద్రఖని గారు తమిళ భాషాసాహిత్యం తెలుసుకోవడం వల్లే సాధ్యం అయింది. అందుకు వారికి ధన్యవాదాలు.

ఇంతకు ముందు వారు చెప్పినట్టుగా ఇది 70 రోజులు చేయాల్సిన సినిమా. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సాధ్యం కావడం లేదు. నేను ఎన్టీఆర్, రామ్ చరణ్ లా డ్యాన్సులు చేయలేను. ప్రభాస్ లా పెద్ద కౌటట్ ను కాదు.అందుకే మా ఫ్యామిలీ హీరోలతో పాటు మీకూ చెప్పేదేంటంటే.. ఇండస్ట్రీలోకి ఎవరైనా రావొచ్చు. అందుకు దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన అన్నయ్య చిరంజీవి గారే ఉదాహరణ. అందుకే నన్ను సినిమాల్లోకి వస్తావా అన్నప్పుడు చిరంజీవి తప్ప నాకు వేరే హీరో కనిపించలేదు. కృష్ణ, ఎన్టీఆర్, నాగేశ్వరరావు గారు ఇష్టంగా ఉన్నా ఇది నా పని కాదు అనుకున్నా. ఒక చిన్న ఉద్యోగం చేస్తూ చిన్న ఊరిలో ఉండాలనుకున్నా. కానీ మా ఒదిన చెప్పిన మాటలు విని సినిమాల్లోకి వచ్చాను. సుస్వాగతం సినిమా షూటింగ్ లో వైజాగ్ లో ఓ పాట షూటింగ్ చేస్తన్నప్పుడు అందరి ముందు నటిస్తున్నప్పుడు సిగ్గుతో చచ్చిపోయాను. ఆ రోజు మా ఒదిన చేసిన తప్పు వల్లే ఈ రోజు మీ ముందున్నాను. చిరంజీవి గారు కష్టపడి సాధించుకున్నారు. నేనేదీ గ్రాంటెడ్ గా తీసుకోలేదు. ఆయన పదిశాతం కష్టపడితే నేను అంతకు మించి కష్డపడాలనుకున్నాను.అందుకే ఒళ్లు హూనం అయ్యేలా కష్టపడేలా చేసుకున్నాను. మా వైష్ణవ్, సాయితేజ్, వరుణ్ కు చెప్పేది ఒకటే.. ఏదీ గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. మనం హార్డ్ వర్క్ చేద్దాం అని. మనకూ సమస్యలుంటాయి. ఫెయిల్యూర్స్ ఉంటాయి అని చెప్పాను. ఇంకా చెబితే మేం గొడ్డు చాకిరీ చేస్తాం. కడుపులు మాడ్చుకుంటాం. కష్టపడతాం. మరి మేమే చేయగలిగినప్పుడు దిగువ మధ్య తరగతి వాళ్లు ఎందుకు చేయలేరు అనిపిస్తుంది. నాకు ఈ సినిమా ప్రత్యేకమైనది. త్రివిక్రమ్ గారు నేను ఏం మాట్లాడుకుంటామా అని చాలామంది అనుకుంటారు. ఎమ్మెస్సీ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన త్రివిక్రమ్ గారితో నేను ఎక్కువగా సాహిత్యం, సైన్స్ గురించే మాట్లాడుకుంటాం. చాలామంది ఆయనకు తెలుగు మాత్రమే తెలుసు అనుకుంటారు. కానీ ఆయనకు సంస్కృతం, హిందీ కూడా బాగా తెలుసు. నీ స్నేహితుడు ఎవరో చెప్పు నీ గురించి చెబుతాం అంటారు.నాకు నిజంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని గురుస్థానంలో పెడతాను. నాకు చాలా విషయాలు తెలియవు. పురాణాలు, సాహిత్యం, విశ్వనాథ సత్యనారాయణ, జాషువా గురించి అనర్గళంగా మాట్లాడే పండితుడాయన.ఆయన తెలుగు భాషకు మేలుచేసిన పండితుడు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని సాహిత్య విలువలు తెలుసుకోవాలి. రాజమౌళి లాంటిపెద్దలు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. రేపు రాజమౌళి, మహేష్ గారు చేసే సినిమా అద్భుతంగా ఉండాలని కోరుకుంటాను. నేను అందరి సినిమాల గురించి ఆలోచిస్తాను. ఒక హీరో సినిమా చేస్తే ఎన్నో కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. అందుకే నాకు హీరోస్ అంటే నాకు గౌరవం. అందరూ కష్టపడతారు. చిన్న పెద్ద హీరోలు అనే భావం నాకు ఉండదు. కానీ నేను సినిమా చేస్తున్నప్పుడు మిగతా అందరి కంటే పెద్ద హిట్ కొట్టాలని అనుకుంటాను. ఈ పోటీ సినిమా వరకూ గట్టిగా ఆలోచిస్తాను.

ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా వచ్చినప్పుడు నాకూ ఆ సినిమాను కొట్టేయాలనిపిస్తుంది. కానీ నేను సంపూర్ణంగా సినిమాల్లో లేను. అయినా అందరూ ఆ దిశగా ఆలోచిస్తే తెలుగు సినిమా పరిశ్రమలో పోటీ పెరుగుతుంది. మంచి సినిమాలు వస్తాయి. తెలుగు సినిమా పరిశ్రమ భాషా భేదాలు చూడదు. అందుకే సముద్రఖని గారితో సినిమా చేశాను. నేను ఈ సినిమా 21 రోజుల్లో చేయగలిగాను అంటే కారణం సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవన్ గారికి ధన్యవాదాలు. తమన్ నాకు మణిశర్మ గారి దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి తెలుసు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకు ఆయనే పనిచేశారు. ఇది హ్యాట్రిక్ ఫిల్మ్. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్ట్ లందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా నాక ప్రత్యేకమైనది. సాయిధరమ్ తేజ్ యాక్ట్ చేస్తా అని నా దగ్గరకి వచ్చాడు. అప్పుడు నేను ఎంకరేజ్ చేయలేదు.. డిస్కరేజ్ చేయలేదు. ఒక యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ చేశాను. ఎప్పుడూ రికమెండ్ చేయలేదు. ఫస్ట్ మూవీకి వైవీఎస్ చౌదరి తీసుకున్నాడు.

ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది. సాయికి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. నేను హాస్పిటల్ కు వెళ్లాను డాక్టర్లు ఒక రోజులో కోలుకుంటాడు అని చెప్పారు. కానీ రాలేదు. నేను నిస్సహాయంగా అయిపోయాను. కానీ ఆ రోజు ఇస్లాం కమ్యూనిటీకి సంబంధించి అబ్దుల్ ఫర్శాన్ అనే కుర్రాడు కాపాడాడు. అతను లేకపోతే ఈ రోజు తేజ్ మనముందు లేకపోయేవాడు. తేజ్ ను హాస్పిటల్ లో చూసినప్పుడు డాక్టర్స్ చెప్పలేం అన్నారు. అప్పుడు దేవుడిని వాడిని బతికించాలని కోరుకున్నాను. వాడు అనే కాదు.. రోడ్ మీద ఎవరు పడిపోయినా.. నేనే వెళ్లి చొక్కాలకు రక్తం అంటినా కాపాడాను. అపోలో, మెడికవర్ హాస్పిటల్ టీమ్ అందరికీ కృతజ్ఞతలు. తేజ్ కోలుకుని మాట సరిగా రావడ లేదు. నడవలేకపోతున్నాడు. నడవలేకపోతున్నాడు. బ్రెయిన్ సరిగా లేదు. అయినా త్రివిక్రమ్ గారు ఈ సినిమా తేజ్ కే ఇద్దాం అని చెప్పాడు. ఎందుకు అంటే.. తేజ్ రిపబ్లిక్ సినిమాలో అద్భుతంగా నటించాడు అని చెప్పారు. ఈ సినిమా టైమ్ లో తేజ్ డైలాగ్స్ చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు. అయినా ఇది సాయికి తేజ్ కు స్పీచ్ థెరఫీ అని చెప్పిన సముద్రఖనికి థ్యాంక్యూ చెబుతున్నాను. ఈ సందర్భంగా ఇది ఇంత వేగంగా చేయడానికి కారణమైన.. నా పొలిటికల్ షెడ్యూల్స్ ను దృష్టిలో పెట్టుకుని విశ్వ ప్రసాద్ గారు, వివేక్ కూచిభొట్ల గారు ప్లాన్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన నా సన్నిహితులు టిజి వెంకటేష్ గారికి ధన్యవాదాలు. నా కాస్ట్యూమ్స్ నీతా లుల్లా గారు నా డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో పట్టుపట్టి నాతో కొత్త కొత్త డ్రెస్ లు వేయించిన నీతా లుల్లాగారికి థ్యాంక్యూ. మిగతా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..” అన్నాడు. చివర్లో తేజ్ అడిగాడు అని తన మెడలో ఉన్న ఓ దండను తేజ్ కు బహూకరిస్తూ.. పండగ చేసుకో అని చెప్పడం ఫ్యాన్స్ లో జోష్ నింపింది.చివర్లో తమిళ సినిమా పరిశ్రమకు ఓ సూచన చేశాడు పవన్ కళ్యాణ్.. “అలాగే తమిళ చిత్ర పరిశ్రమకు కూడా చిన్నపాటి విన్నపం. పరిశ్రమలో మనవాళ్లే పనిచేయాలన్న ఆలోచన నుంచి బయటకు రావాలని సూచన చేస్తున్నాం. ఇవాళ తెలుగు చిత్ర పరిశ్రమ అందరికీ అన్నం పెడుతుంది. మీరు కూడా ఈ భావన నుంచిబయటకు వచ్చి అందరినీ ఎంకరేజ్ చేయాలి. అన్ని భాషల్లో ఉన్నవారికి అవకాశాలివ్వాలని కోరుకుంటున్నా. అలాగే తమిళ్ నుంచి ఇతర భాషలకు రోజా, జెంటిల్మన్ లాంటి సినిమాలు వచ్చాయంటే కారణం.. ఏఎమ్ రత్నం గారు. ఆయన ఓ తెలుగువాడు. అలాంటి వారి వల్లే తమిళ్ సినిమా స్పాన్ పెరిగింది. ఆ భాషల్లో పెద్దలకు విన్నపం చేసుకుంటున్నా.. “అన్నారు.ఇక చివర్లో సినిమా గురించి నేను ఎప్పుడూ గొప్పగా చెప్పలేదు. నీ పని నువ్వు చేయి అనే భగవద్గీతను నమ్ముతాను. కానీ ఈ సినిమాను మేము మా శాయశక్తులా చేశాం. మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను.. జై హింద్.. ” అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు పవన్ కళ్యాణ్‌.

Related Posts