ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తిన అనుపమ్ ఖేర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. బాలీవుడ్ సెలబ్రిటీస్ ను బాగా ఆకట్టుకుంటున్నాడు. ‘వార్ 2’ కోసం ముంబైలో విహరిస్తున్న తారక్.. పనిలోపనిగా బీటౌన్ స్టార్స్ తో బాండింగ్ పెంచుకుంటున్నాడు. వారు కూడా ఎన్టీఆర్ ను కలుసుకోవడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈకోవలోనే ఎన్టీఆర్.. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ను కలుసుకోవడం జరిగింది.

వాళ్లు కలుసుకున్న సందర్భం తెలియకపోయినా.. తన ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్ ను కలవడం ఎంతో సంతోషంగా ఉందని సామాజిక మాధ్యమం ద్వారా తెలిపాడు అనుపమ్ ఖేర్. అలాగే.. ఎన్టీఆర్ వర్క్ తనకు చాలా ఇష్టమని.. అతను ఎంతో ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశాడు. అనుపమ్ ట్వీట్ కి ఎన్టీఆర్ రిప్లై ఇచ్చాడు. తాను ఎప్పుడూ అభిమానించే నటుల్లో అనుపమ్ ఒకరని.. ఆయన రాబోయే తరాలకు కూడా ప్రేరణగా ఉంటారని తారక్ అన్నాడు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

Related Posts