ప్రభాస్ కిట్టీలో అరడజను సినిమాలు

టాలీవుడ్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్ సినిమాల స్పీడు మామూలుగా లేదు. ‘సలార్’తో సెన్సేషనల్ హిట్ అందుకుని తిరిగి ఫామ్ లోకి వచ్చిన రెబెల్ స్టార్.. ప్రస్తుతం ‘కల్కి’ చిత్రాన్ని విడుదలకు ముస్తాబు చేస్తున్నాడు. జూన్ 27న ‘కల్కి’ రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం ‘రాజా సాబ్’ కూడా సగభాగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది.

మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ మహాబలిపురంలో జరుగుతున్నాయట. ఈ సినిమాకి తమన్ సంగీతాన్నందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ మూవీలో ప్రభాస్ రొమాంటిక్ అవతార్ లో అలరించనున్నాడట. ప్రభాస్ కి జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ వంటి ముగ్గురు భామలు నటిస్తున్నారు.

‘రాజా సాబ్’ పూర్తి కాకుండానే హను రాఘవపూడి చిత్రాన్ని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రభాస్. ఈ ఏడాది జూలై నుంచే హను రాఘవపూడి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని హైదరాబాద్ సంస్థానంలోని రజాకార్ల ఇతివృత్తంతో తీర్చిదిద్దుతున్నాడట హను రాఘవపూడి. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

ప్రభాస్ నటించబోయే మరో క్రేజీ మూవీ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రూపొందే ‘స్పిరిట్’. ఫస్ట్ టైమ్ ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోయే సినిమా ఇది. సందీప్ రెడ్డి వంగా మార్క్ మేకింగ్ తో ఈ సినిమాని సమ్‌థింగ్ స్పెషల్ గా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో ప్రభాస్ మేకోవర్ నెవర్ బిఫోర్ అన్నట్టు ఉండబోతుందని డైరెక్టర్ సందీప్ ఇప్పటికే పలుమార్లు చెప్పాడు. ఈ ఏడాది చివరి నుంచి ‘స్పిరిట్’ సెట్స్ పైకి వెళ్లనుంది.

‘కల్కి, రాజా సాబ్, హను రాఘవపూడి చిత్రం, స్పిరిట్’ సినిమాలతో పాటు.. ది మోస్ట్ అవైటింగ్ ‘సలార్ 2’.. ఆ తర్వాత ‘కల్కి 2’ కూడా ప్రభాస్ కిట్టీలో ఉన్నాయి. మొత్తంమీద.. ప్రస్తుతం అరడజను సినిమాలతో ప్రభాస్ ఇండియాలోనే బిజీయెస్ట్ స్టార్ గా ఉన్నాడు. మిగతా వాళ్లెవరూ అతని దరిదాపుల్లో కూడా లేరు.

Related Posts