నా సినిమా ఒక డాన్ నే మార్చింది – సముద్రఖని

బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ చిత్ర దర్శకుడు సముద్రఖని చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ కథ తెలుగులో పవన్ కళ్యాణ్ వరకూ ఎలా వెళ్లింది అనే అంశాన్ని పంచుకున్నాడు. ఎక్కడో తమిళనాడులో వెయ్యి కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన తను ఈ సినిమా చేయడానికి కారణం “టైమ్” అన్నాడు. ఆ టైమే తనను ఇక్కడి వరకూ తెచ్చిందని చెప్పాడు. ఈ సందర్భంగా ఈ కథ పవన్ కళ్యాణ్ వరకూ వెళ్లిన విధం గురించి చెప్పాడు.


“ఓ రోజు నేను త్రివిక్రమ్ గారితో ఉన్నాను. నాకు ఓ ఫోన్ వచ్చింది. మధురై నుంచి ఓ పెద్ద డాన్ మాట్లాడాడు. నా సినిమా చూసి తను మారిపోయాను అని చెప్పాడు. అతనెవరు అని త్రివిక్రమ్ గారు అడిగితే నేను విషయంచెప్పాను. త్రివిక్రమ్ గారు ఆ సినిమా కథ గురించి అడిగారు. అప్పుడు నేను చెప్పాను. ఇది టైమ్ వాల్యూ గురించిన కథ అని. అదేంటీ అంటే.. ఒక మనిషి చనిపోతే స్వర్గానికి వెళతాడు అక్కడ కులం,మతం, జాతి, భేదం ఏమీ ఉండవు.. మరి నరకంలో అంటే అక్కడి నుంచే కదా తీసుకువెళుతున్నాను అన్నాను.

వెంటనే త్రివిక్రమ్ గారు ఓ పది నిమిషాలు టైమ్ తీసుకుని ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నారు. అలా మొదలైంది ఈ కథ.త్రివిక్రమ్ గారు ఈ కథను అద్భుతంగా డెవలప్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారి రియల్ లైఫ్ కథలా ఉంటుంది. ఈ కథలో నా తమ్ముడు సాయితేజ్ ఓ పెద్ద బలం. నా ఆర్టిస్టులు అందరికీ కృతజ్ఞతలు. ఫస్ట్ టైమ్ ఎస్టాబ్లిష్డ్ టెక్నీషియన్స్ తో పనిచేశాను.

నా ఫస్ట్ ఫిల్మ్ కు తమన్ సంగీత దర్శకుడు. 23యేళ్ల తర్వాత మళ్లీ తమన్ తో కలిసి పనిచేస్తున్నాను. ఇది నా 50వ సినిమా. 23నిమిషాల టైమ్ రీ రికార్డింగ్ చూశాను. తమన్ ఏమైందన్నా అన్నాడు. ఏమో మ్యాజిక్ జరుగుతుందని చెప్పాను. ఈ సందర్భంగా నాతో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను.

నిర్మాతలు వివేక్, విశ్వ ప్రసాద్ గారికి థ్యాంక్యూ.17యేళ్ల క్రితం ఓ నాటకంలో చూసిన పాయింట్ ఈ కథ.మా గురువు